Gaami: అందరూ గర్వపడే సినిమా ‘గామి’: విశ్వక్‌ సేన్‌

విశ్వక్‌సేన్‌ ‘గామి’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ తాజాగా జరిగింది. 

Published : 07 Mar 2024 14:35 IST

హైదరాబాద్‌: విశ్వక్‌ సేన్‌ (Vishwak sen) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘గామి’ (Gaami). విద్యాధర్‌ కాగిత ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చాందినీ చౌదరి కథానాయిక. మార్చి 8న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. అడివి శేష్, హనురాఘవపూడి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

‘‘విద్యాధర్‌ కాగిత వంటి గొప్ప వ్యక్తిని నేను జీవితంలో చూడలేదు. తన మాటపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా చేశాను. మంచి కథ కచ్చితంగా హిట్‌ అవుతుంది. ప్రేక్షకుల్ని కట్టిపడేసే సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. శివరాత్రికి విడుదల చేయాలని అనుకోలేదు. ఇది దైవ నిర్ణయం. విభిన్నమైన కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది. మంచి సినిమా చూశామన్న ఫీలింగ్‌ అందరికీ కలుగుతుంది. ఎంతో రిస్క్‌ చేసి దీన్ని తెరకెక్కించాం. అందరూ గర్వపడే సినిమా ఇది. మా కష్టానికి తగిన ఫలితం దక్కుతుందనే నమ్మకం ఉంది. చాందినీ చౌదరి ఈ సినిమా కోసం కష్టపడింది. మార్చి 8న థియేటర్‌లో కలుద్దాం’ అని విశ్వక్‌సేన్‌ అన్నారు.

ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్‌

తాజాగా రాజమౌళి (ss Rajamouli) దీనిపై ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ‘‘కఠోరమైన కృషి ఉంటే అసాధ్యమైన కలలు సాకారమవుతాయి. ‘గామి’ గురించి దర్శకుడు, నిర్మాత ఎంత కష్టపడ్డారో నాతో చెప్పినప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. ఇందులోని విజువల్స్‌ చూస్తే నాలుగేళ్ల నుంచి వాళ్లు ఎంత కష్టపడ్డారో అర్థమైంది’’ అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని