Yami Gautam: ‘ఓ మై గాడ్2’కు ‘ఏ’ సర్టిఫికెట్‌.. యామీ గౌతమ్‌ ఏమన్నారంటే..

 ‘ఓ మై గాడ్2’ (OMG 2 Movie)కు సెన్సార్‌ ‘ఏ’ సర్టిఫికెట్‌ ఇవ్వడంపై నటి యామీ గౌతమ్ మాట్లాడారు. సినిమా విజయం సాధిస్తుందని చిత్రబృందానికి నమ్మకముందని ఆమె తెలిపారు. 

Published : 10 Aug 2023 18:42 IST

ముంబయి: బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) హీరోగా తెరకెక్కిన చిత్రం  ‘ఓ మై గాడ్2’ (OMG 2 Movie). గత కొన్ని రోజులుగా ఈ సినిమా పేరు నిత్యం వార్తల్లో వినిపిస్తోంది. అక్షయ్‌ శివుడిగా కనిపించనున్న ఈ సినిమాలో నటి యామీ గౌతమ్ కూడా ప్రధానపాత్రలో నటించారు. ఈ సినిమాకు తాజాగా సెన్సార్‌ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్‌ను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీని గురించి యామీ గౌతమ్‌ (Yami Gautam) మాట్లాడారు.

‘‘ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ ఇస్తుందని చిత్రీకరణ సమయంలో మేమేవ్వరం అనుకోలేదు. ‘ఓ మై గాడ్‌’ మొదటి భాగం విజయాన్ని సాధించింది. దానికి సీక్వెల్‌గా తెరకెక్కించిన ఈ సినిమాపై విడుదలకు ముందే వార్తలు వస్తున్నాయి. సెన్సార్‌ బోర్డు సభ్యులు సినిమాకు చెప్పిన మార్పులన్నీ అందరికీ తెలియడం సరైన పద్ధతి కాదని నా అభిప్రాయం. ఆ మార్పులు చిత్రబృందం వరకే తెలిస్తే సరిపోతుందని నేను భావిస్తున్నాను. సెన్సార్‌ బోర్డు సభ్యులు వారి బాధ్యతలను నిర్వర్తించారు. వారిని మేము తప్పుపట్టడం లేదు. ఒకరికి సరైనది అనిపించినది.. మరొకరికి తప్పుగా అనిపించవచ్చు’’.

పవన్‌కల్యాణ్‌కే నా మద్దతు.. ఆయన డబ్బు మనిషి కాదు: రేణూ దేశాయ్‌

‘‘ స్క్రిప్ట్‌ను అర్థం చేసుకుని డైలాగులను చెప్పడం నటీనటుల బాధ్యత. మా వృత్తిపై మేము ఎంతో అంకితభావంతో ఉంటాం. సినిమాపై దర్శకుడికి నమ్మకం ఉంటే ఎన్ని అడ్డంకులు ఉన్నా అది ప్రేక్షకులకు కచ్చితంగా చేరుతుంది. ‘ఓ మై గాడ్‌2’పై డైరెక్టర్‌ ఎంతో నమ్మకంగా ఉన్నారు. అందుకే ఇది కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతుందని మేమంతా ఆశిస్తున్నాం. ఈ సినిమాను అందరూ చూడాలి. ముఖ్యంగా పిల్లలు దీని గురించి తెలుసుకోవాలి’’ అని యామీ గౌతమ్ చెప్పారు. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు