ఆస్ట్రేలియా: ‘హ్యూమన్‌ రైట్స్‌’ వ్యాసరచన పోటీలో విజేతగా అరుణ్‌ గోగినేని

ఆస్ట్రేలియన్ ఛార్టర్‌ ఆఫ్ హ్యూమన్‌ రైట్స్‌ అండ్ ఫ్రీడమ్‌ అంశానికి సంబంధించి వ్యాసరచన పోటీల్లో..

Updated : 19 Jun 2022 00:16 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియన్ ఛార్టర్‌ ఆఫ్ హ్యూమన్‌ రైట్స్‌ అండ్ ఫ్రీడమ్‌ అంశానికి సంబంధించి వ్యాసరచన పోటీల్లో బాబు గోగినేని కుమారుడు అరుణ్‌ గోగినేని విజేతగా నిలిచారు. ఆస్ట్రేలియాలోని వెరిబీ సెకండరీ కాలేజ్‌లో చదువుతున్న అరుణ్‌ గోగినేనితో పాటు మరో విద్యార్థి జోష్‌వా సంయుక్తంగా విజేతలుగా నిలిచారని బాబు గోగినేని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఒకే కాలేజ్‌కు చెందిన విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలవడం విశేషమని బాబు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను బాబు గోగినేని షేర్‌ చేశారు. ఆస్ట్రేలియాలో పాఠశాల విద్యార్థులకు హక్కుల పట్ల  అవగాహన కల్పించేందుకు ఏటా ‘హ్యూమన్‌ రైట్స్ లా సెంటర్’ ఇలాటి పోటీలను నిర్వహిస్తుందని బాబు గోగినేని వివరించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని