'అఖండ' విజయం.. బే ఏరియాలో అభిమానుల కోలాహలం
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'అఖండ' సినిమా గురువారం విడుదలైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విడుదలైన చిత్రం...
ఇంటర్నెట్ డెస్క్: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'అఖండ' సినిమా గురువారం విడుదలైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విడుదలైన చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. అమెరికాలోని బే ఏరియాలో 'అఖండ' విజయాన్ని అభిమానులు ఆనందంతో సంబరాలు చేసుకొంటున్నారు. చాలా కాలం తర్వాత బాలయ్య మంచి మాస్ హిట్ అందుకున్నారని వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ అభిమానులు చందు మల్లెల, శ్రీకాంత్ దొడ్డపనేని, గంగా కోమటి, లక్ష్మణ్ పరుచూరి, సాయి కంభంపాటి, అజయ్ యార్లగడ్డ, అర్జున్ ఆరికట్ల, అరవింద్, మధు కండేపి, సతీష్ బొల్లా, ప్రకాష్, సత్యనారాయణ తిపిర్నేని, వెలగపూడి బ్రదర్స్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. 108 కొబ్బరికాయలు కొట్టి ఎన్టీఆర్, బాలకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కేకు కోసి వేడుక చేసుకున్నారు. అభిమానులతో పాటు అందరికి నచ్చేలా మాస్ ఎలిమెంట్స్‌తో బోయపాటి సినిమాను మలిచారన్నారు. బాలయ్య ఎప్పటిలాగే తన నట విశ్వరూపం చూపించారని, అఘోరా పాత్ర సినిమాకే హైలెట్‌గా నిలిచిందని సంతోషం వ్యక్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
తెలంగాణలో మరోదఫా ఓటర్ల జాబితా సవరణ
-
Sports News
ఆ మార్పులు కలిసొచ్చాయి: గిల్
-
Movies News
నాలోని కామెడీ కోణమే.. మెర్క్యురీ సూరి
-
Movies News
Abhiram: భయంతో నిద్ర పట్టడం లేదు.. తేజ అందరి ముందు తిట్టారు: అభిరామ్
-
World News
Ross: 54 ఏళ్ల నిరీక్షణ.. 71 ఏళ్ల వయస్సులో డిగ్రీ పట్టా!
-
Crime News
Crime News: కార్ ట్రావెల్స్ పెట్టాలన్న కోరికే డ్రైవర్ కొంపముంచింది