ఖతార్‌లో వైభవంగా మినీ మహానాడు వేడుకలు

ఎన్నారై తెదేపా-ఖతార్‌ శాఖ ఆధ్వర్యంలో మినీ మహానాడు వేడుకలు వైభవంగా జరిగాయి. ....

Published : 28 May 2022 20:38 IST

ఖతార్‌: ఎన్నారై తెదేపా-ఖతార్‌ శాఖ ఆధ్వర్యంలో మినీ మహానాడు వేడుకలు వైభవంగా జరిగాయి. ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళులర్పించడంతో పాటు ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గీతాలాపనతో మహానాడు వేడుకను ప్రారంభించారు. నేతల అద్భుత ప్రసంగాలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్నారై తెదేపా ఇంఛార్జి చప్పిడి రాజశేఖర్‌, ఐటీడీపీ రాష్ట్ర మహిళా కోఆర్డినేటర్‌ జేడీ మౌనిక వీడియోకాల్‌ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ.. సభాప్రాంగణ అలంకరణ ఎంతగానో ఆకట్టుకొందని, పార్టీ తోరణాలు, జెండాలతో పాటు, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, పార్టీ అధినేత చంద్రబాబు నిలువెత్తు ఫ్లెక్సీలు, భారీ కటౌట్లతో సభా ప్రాంగణం పసుపుమయంగా పండుగ వాతావరణాన్ని తలపించిందని ప్రశంసించారు. ఎన్నారై తెదేపా సభ్యత్వ నమోదును పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రవాస తెలుగువారు, ముఖ్యంగా తెదేపా అభిమానులు తమ సభ్యత్వ నమోదు తప్పనిసరిగా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం జేడీ మౌనిక మాట్లాడుతూ.. దేశవిదేశాల్లో మహానాడు వేడుకలను నిర్వహించి తెలుగువారు ఎక్కడ ఉన్నా తెదేపా అంటే తమకు ఎంత అభిమానమో చాటుకొంటున్నారన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నైరాల పాత్ర ఎంతో కీలకమని, అందరూ పార్టీకి అన్నివేళలా అండగా నిలవాలని కోరారు.

ఈ మినీ మహానాడు నరేష్ మద్దిపోటి ప్రారంభోపన్యాసంతో  ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం 4 గంటలవరకు కొనసాగింది. రవి పొనుగుమాటి, గొట్టిపాటి రమణయ్య, శాంతయ్య యలమంచిలి, నరేష్ నూతలపాటి, రమేష్ దాసరి, దామచర్ల వెంకటరావు, మలిరెడ్డి సత్యనారాయణ, జేవీ సత్యనారాయణ, కొడాలి సుధాకర్, మలసాని అనిల్, జీఎంఎంఎస్‌ నాయుడు, కళ్యాణ్ నార్నె, గిరిబాబు నాయుడు అడుసుమిల్లి, గౌతమ్‌లు ఆసక్తికర ప్రసంగాలతో శ్రోతలను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన నరేష్ మద్దిపోటి, పొనుగుమాటి రవి, రమేష్ దాసరి, సంతోష్ సింగరాజు, రామారావు బొడ్డు,  అనిల్ మలసాని, రవీంద్ర మాగులూరి, తదితర నేతలు, ఖతార్ తెదేపా కుటుంబ సభ్యులకు మహానాడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.  మహానాడులో రెండు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఎన్నారై తెదేపా సభ్యత్వ నమోదును భారీగా చేపట్టడం ఒకటి కాగా.. ఎన్నారై తెదేపా ఖతార్‌ పేజీని పటిష్టపరచి పార్టీ చేసిన మంచి పనులను ప్రజలకు మరింతగా వివరించడం, పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్ర అవసరాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తీసుకెళ్లడం రెండోది. ఈ రెండు తీర్మానాలను మహానాడు ఆమోదించింది. ఈ కార్యక్రమానికి పొనుగుమాటి రవి వ్యాఖ్యాతగా వ్యవహరించి ధన్యవాద తీర్మానంతో సభను ముగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని