విశ్వహిందీ పరిషత్తు సమన్వయకర్తగా అచార్య యార్లగడ్డ

ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. హిందీ భాషాభివృద్ధి కోసం ప్రపంచ వ్యాప్తంగా కృషి చేస్తోన్న విశ్వహిందీ పరిషత్తు.. ఆచార్య యార్లగడ్డను అమెరికా, కెనడా దేశాలకు హిందీ భాషా సమన్వయకర్తగా నియమించింది.

Updated : 23 Jan 2024 22:47 IST

అమెరికా, కెనడాలో హిందీపై అధ్యయనం, వ్యాప్తికి కృషి 

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. హిందీ భాషాభివృద్ధి కోసం ప్రపంచ వ్యాప్తంగా కృషి చేస్తోన్న విశ్వహిందీ పరిషత్తు.. ఆచార్య యార్లగడ్డను అమెరికా, కెనడా దేశాలకు హిందీ భాషా సమన్వయకర్తగా నియమించింది. అక్కడి ఔత్సాహికులకు హిందీ నేర్చుకోవటంలో ఆయన ప్రత్యేక తర్ఫీదు ఇస్తారు. నెల రోజుల తర్వాత కెనడా చేరుకుని అక్కడ కూడా హిందీపై అధ్యయనానికి అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఈ నేపథ్యంలో హిందీ పరిషత్తు నేతృత్వంలో సంయోజకుడు విపన్‌ కుమార్‌ మంగళవారం యార్లగడ్డకు దిల్లీలో స్వాగతం పలికి జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన అమెరికా బయలుదేరి వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని