సింగపూర్‌లో వైభవంగా అయోధ్య రాముడి పవిత్ర అక్షింతల వితరణ మహోత్సవం

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్(TCSS) ఆధ్వర్యంలో అయోధ్య రాముడి పవిత్ర అక్షింతల వితరణ మహోత్సవం వైభవంగా జరిగింది.

Published : 26 Jan 2024 19:16 IST

సింగపూర్‌: తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్(TCSS) ఆధ్వర్యంలో అయోధ్య రాముడి పవిత్ర అక్షింతల వితరణ మహోత్సవం వైభవంగా జరిగింది. అయోధ్య నుంచి తెప్పించిన అక్షింతలను సింగపూర్‌లోని భక్తులకు అందజేశారు. జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు ఇక్కడి చాంగి విలేజ్‌లో ఉన్న రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ పవిత్ర వేడుక ఇక్కడి దేవాలయాల్లో నిర్వహించే అవకాశం దక్కడం సొసైటీకి దక్కిన పుణ్యమని పలువురు సభ్యులు పేర్కొన్నారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో స్థానిక భక్తులంతా భక్తిశ్రద్ధలతో పాల్గొని రామనామస్మరణలు చేశారు. ప్రసాదంతో పాటు అక్షింతలు స్వీకరించిన భక్తులు జైశ్రీరామ్‌ నినాదాలు చేయడంతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.  ఈ మహోత్సవంలో దాదాపు 1000 మంది పాల్గొని పవిత్ర అక్షింతలను స్వీకరించారు.

ఈసందర్భంగా భక్తులు మాట్లాడుతూ.. ఈ పవిత్ర కార్యక్రమాన్ని సింగపూర్‌లో నిర్వహించిన తెలంగాణ కల్చరల్ సొసైటీ- సింగపూర్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ అభినందించారు.  తెలుగు రాష్ట్రాలకు చెందినవారితో పాటు ఇతర భక్తులు పెద్దఎత్తున ఈ వేడుకలో పాల్గొని విజయవంతం చేశారని.. వారందరికీ టీసీఎస్‌ఎస్‌ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకకు తరలివచ్చిన భక్తులకు సొసైటీ అధ్యక్షులు గడప రమేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గాప్రసాద్, భాస్కర్ గుప్త, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాసరావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకటరమణ, నడికట్ల భాస్కర్, రవికృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు రోజారమణి, రాధికా రెడ్డి నల్లా,   శివప్రసాద్ ఆవుల, పెరుకు శివరామ్ ప్రసాద్, రవిచైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి,  విజయమోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి తదితరులు కృతజ్ఞతలు చెప్పారు. భారత్‌ నుంచి ఈ పవిత్ర అక్షింతలను తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన గోనె నరేందర్‌ రెడ్డికి సభ్యులంతా అభినందనలు తెలిపారు. అలాగే, ఈ పుణ్య కార్యాన్ని సింగపూర్‌లోని ఆలయంలో నిర్వహించడంపై సింగపూర్‌లోని ఆలయ అధికారులు ఆనందం వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని