ఘ‌నంగా QIQ లెర్నింగ్ ఆకాడ‌మీ ప్రారంభం

విద్యార్థులకు అవ‌స‌ర‌మ‌య్యే కోర్సుల‌ను ఆధునిక పద్ధతుల్లో అందించ‌డానికి క్యూఐక్యూ (QIQ) లెర్నింగ్ ఆకాడ‌మీ ప్రారంభ‌మైంది.

Published : 28 Jan 2024 13:45 IST

న్యూజెర్సీ: విద్యార్థులకు అవ‌స‌ర‌మ‌య్యే కోర్సుల‌ను ఆధునిక పద్ధతుల్లో అందించ‌డానికి క్యూఐక్యూ (QIQ) లెర్నింగ్ ఆకాడ‌మీ ప్రారంభ‌మైంది. న్యూజెర్సీలోని సౌత్ ప్లేయిన్‌ఫీల్డ్‌లో దీనిని మేయర్ అనిష్.. కౌన్సిల్ మాన్ డేరిక్, కౌన్సిల్ మాన్ జోసెఫ్ సీ ఓలక్‌లతో కలిసి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా అనిష్ నిర్వాహకులకు శుభాకాంక్షలు  తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన కోర్సులు అందిస్తూ, పేదలకు ఉచితంగా భోదిస్తున్నందుకు.. ప్రభుత్వం గౌరవప్రదంగా అందించే బోరగ్ అనే బ్యాడ్జిని QIQ లెర్నింగ్ ఆకాడ‌మీ ఫౌండర్ శ్రీకాంత్‌కు మేయర్ అందించారు. అలాగే సహకారం అందించిన విలాస్ జంబు, సందీప్‌లకు కూడా బ్యాడ్జిని ఇచ్చారు.

తెలుగు ఎన్నారైలు నిర్వహిస్తున్న క్యూఐక్యూ లెర్నింగ్ ఆకాడ‌మీ.. మిగతా వాటి కంటే అతి త‌క్కువ ఫీజుల‌కే నాణ్యమైన, ఆధునిక పద్దతుల్లో కోర్సులు బోధిస్తుంది. పేద‌, మధ్య తరగతి వారికి కోర్సులు ఉచితంగా అందించనున్నారు.

క్యూఐక్యూ లెర్నింగ్ ఆకాడ‌మీ ప్రారంభం సంద‌ర్భంగా విద్యార్థుల‌కు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫ‌ర్ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల విశ్లేషణాత్మక నైపుణ్యాన్ని పెంపొందిస్తే విజ‌యం సాధిస్తారని, అందుక‌నుగుణంగా తాము కోర్సుల‌ను రూపొందించిన‌ట్టు చెప్పారు. తాము అందిస్తున్న కోర్సుల వివరాల కోసం www.qiqlearningacademy.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని తెలిపారు.

QIQ లెర్నింగ్ అకాడ‌మీ నిర్వాహకులకు వేద పండితులు, సాయిదత్త పీఠం నిర్వాహకులు బ్రహ్మశ్రీ రఘు శంకరమంచి ఆశీర్వాచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో పలు తెలుగు ఎన్నారై సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని