కెనడా నోవాస్కోటియాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి పండగను కెనడాలోని నోవాస్కోటియాలో తెలుగు ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు.

Updated : 03 Feb 2024 20:26 IST

సంక్రాంతి పండగను కెనడాలోని నోవాస్కోటియాలో తెలుగు ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. బెడ్‌ఫోర్డ్‌లోని ఫ్రెంచ్ స్కూల్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో హాలిఫాక్స్, డార్ట్ మౌత్, బెడ్ ఫోర్డ్ ప్రాంత వాసులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగ్గులు, గాలిపటాలు, పూల తోరణాలు, భోగి కుండలతో పండగ వాతావరణం ఉట్టిపడేలా వేదికను నిర్వాహకులు సుప్రజా హరి,  ప్రియాంక సురేష్, శ్రీలేఖ బృందం అలంకరించారు, నోవా స్కోటియాలోని 300కు పైగా తెలుగు కుటుంబాలు సంప్రదాయ దుస్తులు ధరించి ఈ వేడుకలకు హాజరయ్యారు. కనకం, దేవిక, పార్వతి, ప్రతిభ, సుప్రజాహరిలతో జ్యోతి ప్రజ్వలన చేయించి సంబరాలను ఘనంగా ప్రారంభించారు.

కెనడా నోవా స్కోటియా తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీహరి రెడ్డి చల్లా ఆధ్వర్యంలో స్పాన్సర్ల (కెనడా ఎడ్యుకేషన్  కనెక్ట్- విజయ్ రాహుల్ భాష్యకర్ల, శ్రీహరి రెడ్డి చల్లా, ఇండియన్ గ్రోసరీస్ - జితేందర్ బాలి, టైటాన్ ఓక్ ఫైనాన్షియల్ సర్వీస్ యాజమాన్యం: ఆండ్రూ లీపర్,  వన్  రియాల్టీ ఈస్ట్ -శివ నవనీథన్) సహకారంతో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు.

నృత్య వేదికలో పిల్లలు నిత్య శ్రీ విద్య; రోహిత్ సాయి చల్లా, శ్రీనివాస్ చిన్ని కుటుంబం; మహాశ్విన్ విద్యా; సుసుష్మ ప్రదీప్ వేదాన్షిక సురేష్; మిహిర మొగలిపురి; శ్రేష్ఠ శ్రీమయీ దొంతంశెట్టి; అమూల్య పిన్నిని; సంగీత రాజు; కీర్తన రాజీవ్, మెగ్గీ కరమ్, మోక్షిత చిన్ని; సాయి రేయాన్ష్ చిన్ని; హర్షవర్ధన్ ఆలేటి; శిబి నందన్ మహేష్ కుమార్; జోషిత్ మొగలి పురి; ఆరాధ్య మల్కా; పూజ బరన్వాల్; రితి నైనికా కోతా; రిధి బొజ్జిని అలరించారు. 

చిన్నా, పెద్దా అందరూ కలిసి భోగి మంటల చుట్టూ నృత్యం చేశారు. హరిదాసుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తెలుగు చిత్రాల పాటలకు నృత్యాలు, జానపదం, కూచిపూడి, భరత నాట్యం, ఒడిసి తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సిబి నాథన్ కర్ర సాము నైపుణ్యంతో ఆశ్చర్యపరిచారు. “సొగసు చూడ తరమా’ అంటూ దంపతుల మధ్య నిర్వహించిన పోటీలు ముచ్చట గొలిపాయి. కళాకారులను పార్వతి శాస్త్రి చెల్లూరి, వేణుగోపాల్ రావు బెజవాడ, నూకరాజు కరణం జ్ఞాపికతో సత్కరించారు. రుచికరమైన విందు భోజనాలను శ్రీనివాస్ చిన్ని బృందం అతిథులకు వడ్డించింది.

ఈ సంక్రాంతి సంబరాలు ఆరు గంటల పాటు ఎంతో ఉత్సాహంగా జరిగాయి. అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ హరి మాట్లాడుతూ.. భావి తరాలకు మన సంప్రదాయాలను తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. భారత జాతి గౌరవాన్ని పెంపొందించేందుకు కెనడా నోవా స్కోటియా తెలుగు అసోసియేషన్ కృషి చేస్తుందని సుప్రజ హరి అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని