కెనడా డీటీసీ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి సంబరాలు

కెనడాలోని టొరంటో నగరంలో డుర్హం తెలుగు క్లబ్ (డీటీసీ) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Published : 21 Nov 2023 15:18 IST

టొరంటో: కెనడాలోని టొరంటో నగరంలో డుర్హం తెలుగు క్లబ్ (డీటీసీ) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దాదాపు 800 తెలుగు కుటుంబాల సభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో చిన్నారులు అలరించారు.  నగరంలో ప్రసిద్ధి గాంచిన ‘గెట్ హోమ్ రియాల్టీ’ అధినేతలు ఆనంద్ పేరిచర్ల, రమేష్ గోల్ల్లు, రఘు జూలూరి ఈ కార్యక్రమానికి చేయూత అందించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా విత్బ్య్ నగర ఎంపీపీ లాన్ కాయ్, డిప్యూటీ మేయర్ మలీహా షాహిద్  విచ్చేశారు. వేడుకలు నిర్వహించిన డీటీసీ కార్య సభ్యులు, వాలంటీర్లను అభినందించారు. ఎంటర్‌ప్రెన్యూర్‌ అఫ్ ది ఇయర్‌గా అవంత్ సోల్యూషన్స్ అధినేత శ్రీనివాస్ వర్మ అట్లూరి ఎంపిక అయ్యారు. ఆయనకు ఎంపీపీ లానేకాయ్ అవార్డును అందచేసి సత్కరించారు. ఏకో ఫ్రెండ్లీ రోల్ మోడల్‌గా సాయి మోహన శర్మ ఎంపిక అయ్యారు. వారిని డీటీసీ కార్య వర్గ సభ్యులు సత్కరించారు.

ప్రముఖ కూచిపూడి నృత్య విద్యాలయ అధినేత సుధా వేమూరి ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి నృత్యాలు అతిథుల్ని అలరించాయి. ఈ వేడుకలకు ప్రత్యేక అతిధులుగా విచ్చేసిన డుర్హం హైదరాబాద్‌ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి డీటీసీ అధ్యక్షుడు నర్సింహా రెడ్డి, గుత్తిరెడ్డి, డైరెక్టర్లు రవి మేకల,  వెంకట్ చిలువేరు, శ్రీకాంత్ సింగిసేతి,  రమేష్ ఉప్పలపాటి, గుణ శేఖర్ రెడ్డి, గౌతమ్ పిడపర్తి, సర్దార్ ఖాన్, వాసు, కమల మూర్తి, యుగి చెరుకూరి, శివ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీటీసీ అధ్యక్షుడు నర్సింహా రెడ్డి దీపావళి పండగ గురించి చక్కగా వివరించారు. వెంకట్ చిలువేరు మాట్లాడుతూ దీపావళి వేడుకలను ఖండాంతరాలు దాటించి మన తెలుగు సంస్కృతిని ఇనుమడింప చేసిన ప్రతి తెలుగు వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 800 తెలుగు కుటుంబాలు ఒక చోట చేరి పండగ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అందరూ అభిప్రాయపడ్డారు. రుచికరమైన వంటకాలతో అతిథులంతా విందు ఆరగించారు. ఈ సందర్భంగా డీటీసీ ఈసీ సభ్యులు ఫుడ్ డ్రైవ్ చేసి ఆహారపదార్థాలను సాల్వేషన్ ఆర్మీ కమ్యూనిటీ సర్వీస్ టీమ్‌కి అందజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని