సింగపూర్‌లో ఉత్సాహంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం

డిసెంబర్‌ 18న అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి-సింగపూర్‌, తెలంగాణ కల్చరల్ సొసైటీ సంయుక్తంగా పాల్గొన్నాయి.

Published : 22 Dec 2023 19:39 IST

సింగపూర్‌: సింగపూర్‌ జలాన్ పాపన్‌లోని టెరుసన్ రిక్రియేషన్ సెంటర్‌లో అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని (డిసెంబర్‌ 18) ఆ దేశ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీ సాంస్కృతిక కళాసారథి-సింగపూర్‌, తెలంగాణ కల్చరల్ సొసైటీ సంయుక్తంగా పాల్గొన్నాయి. ఈ ప్రత్యేక కార్యక్రమంలో వందలాది కార్మిక సోదరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సోదరుల కోసం ప్రత్యేకంగా డ్రాయింగ్ పోటీలు నిర్వహించి 25 మంది విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమములో శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్, ప్రధాన కార్యనిర్వాహక సభ్యులు సుధాకర్ జొన్నాదుల, శ్రీధర్ భరద్వాజ్, రామాంజనేయులు చామిరాజు, తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షులు గడప రమేష్, ప్రధాన కార్యనిర్వాహక సభ్యులు మామిడాల ప్రవీణ్, పేరుకు శివరామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ తదితరులు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో భాగస్వాములైన శ్రీ సాంస్కృతిక కళాసారథి, తెలంగాణ కల్చరల్ సొసైటీ సంస్థలను సింగపూర్ ప్రభుత్వ మానవ వనరులశాఖ ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని