MATA: న్యూజెర్సీలో ఘ‌నంగా ‘మాటా’ కిక్-ఆఫ్, ఫండ్ రైజింగ్ కార్యక్రమం

MATA తొలి కన్వెన్షన్‌ను నిర్వహించేందుకు కిక్‌-ఆఫ్, ఫండ్‌ రైజింగ్ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. 

Updated : 29 Jan 2024 18:59 IST

న్యూజెర్సీ: అమెరికాలోని తెలుగు ప్రజలను ఒక్కటి చేసేందుకు ఏర్పాటైన ‘మ‌న అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి క‌న్వెన్ష‌న్‌ను ఘనంగా నిర్వ‌హించుకునేందుకు కిక్-ఆఫ్, ఫండ్ రైజింగ్ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. న్యూజెర్సీలోని అల్బ‌ర్ట్స్ ప్యాలెస్‌లో జ‌రిగిన ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు. తొలి క‌న్వెన్ష‌న్ నిర్వహణకు   5 లక్షల డాల‌ర్ల‌కు పైగా విరాళాలు అందించిన వారికి ‘మాటా’ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. రాబోయే రోజుల్లో అమెరికాలోని మిగతా రాష్ట్రాల్లోనూ  ‘కిక్ ఆఫ్ ఈవెంట్స్’ నిర్వ‌హించనున్నట్లు తెలిపారు. 

ఈ వేడుకలో గాయకులు స‌మీరా భ‌ర‌ద్వాజ్, వేణు శ్రీ‌రంగం పాట‌లతో సభికులను అల‌రించారు. దీప్తి నాగ్ యాంక‌రింగ్‌తో పాటు పాట‌లు పాడి ఆక‌ట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో అడ్వైజరీ కమిటీ సభ్యుడు ప్రదీప్ సామల, ఈసీ మెంబర్ స్వాతి అట్లూరి, కార్యదర్శి ప్రవీణ్ గూడూరు, కో-ఆర్డినేటర్లు కిరణ్ దుద్దగి, వెంకట్ సుంకిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గనగోని సారథ్యంలో ఏర్పాటైన ఈ అసోసియేష‌న్ అతి త‌క్కువ స‌మ‌యంలోనే వేగంగా విస్త‌రిస్తూ అమెరికాలో దిగ్గ‌జ సంఘాల‌కు ధీటుగా నిల‌బ‌డుతోందని సభ్యులు అభిప్రాయప్డడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని