USA: అమెరికాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అమెరికాలో ఘనంగా నిర్వహించారు.
న్యూజెర్సీ: అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 2న న్యూజెర్సీలో జరిగిన సభకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, హరియాణా ఎంపీ దీపేందర్ హుడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎన్ఆర్ఐలు, ఇతర ప్రతినిధులందర్నీ ఆ సభకు ఆహ్వానించినట్లు టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తున్న నీళ్లు, నియామకాలు, నిధులు అంశంపై చర్చ జరిగింది. అంతేకాకుండా భాజపా, భారస ప్రభుత్వాల హయంలో జరుగుతున్న అన్యాయాలపై కూడా చర్చించారు. అమెరికాలోని 25 నగరాల్లో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రవాసాలుకు ధన్యవాదాలు తెలిపారు. 4వ తేదిన న్యూయర్క్ నగరంలో జాకబ్ జవిట్ సెంటర్‌లో భారత ప్రవాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దాదాపు 5000 మందితో సమావేశం నిర్వహించనున్నారు.ఆ సభకు సమన్వయకర్తగా రేవంత్ రెడ్డిని ఏఐసీసీ నియమించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్
-
IND vs AUS: టీమ్ఇండియా ఆలౌట్.. మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం