అమెరికాలో ఘనంగా ‘వేటా’ బ‌తుక‌మ్మ సంబురాలు

తెలంగాణ పూల పండుగ‌ బ‌తుక‌మ్మ వేడుక‌లు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అమెరికాలో ప్రవాస తెలుగు మహిళలు నిర్వహించిన బతుకమ్మ......

Updated : 14 Oct 2021 23:09 IST

అంచనాకు మించి తరలివచ్చిన జనం

కాలిఫోర్నియా: తెలంగాణ పూల పండుగ‌ బ‌తుక‌మ్మ వేడుక‌లు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అమెరికాలో ప్రవాస తెలుగు మహిళలు నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్ని తాకాయి.  ‘ఉమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్ తెలుగు అసోసియేష‌న్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబురాలకు అంచనాలకు మించి జనం తరలివచ్చారు. ఈ నెల 10న కాలిఫోర్నియాలోని శాన్‌ రామన్‌ స్పోర్ట్స్‌ పార్కులో  మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు జరిగిన ఈ కార్యక్రమానికి అపూర్వ స్పందన వచ్చింది. తొలుత సుమారు 200 మంది హాజ‌రవుతార‌ని భావించినప్పటికీ 600 మందికి పైగా తెలుగు వారు ఉల్లాసంగా, ఉత్సాంగా పాల్గొని ఈ పూల పండుగకు సరికొత్త అందం తీసుకొచ్చారు.

‘ఉమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్ తెలుగు అసోసియేష‌న్’ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి హ‌నుమాండ్ల‌, అధ్యక్షురాలు (ఎలక్ట్‌) శైల‌జ క‌ల్లూరి, కార్యదర్శి అనురాధ ఆలిశెట్టి, సంయుక్త  కార్యదర్శి ప్రశాంతి కూచిభొట్ల‌, మీడియా స‌మ‌న్వయకర్త సుగుణ రెడ్డి, కల్చరల్‌ ఛైర్‌ రత్నమాల వంకా, ప్రాంతీయ సమన్వయకర్త హైమ అనుమాండ్ల‌, కోశాధికారి విశ్వ‌, వైస్ ప్రెసిడెంట్ య‌శ‌శ్విని రెడ్డి, సంయుక్త కోశాధికారి జ్యోతి, క‌మ్యూనిటీ స‌ర్వీస్ చైర్, కాలిఫోర్నియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ ల‌క్ష్మి య‌న‌మండ‌ల‌, శాక్రిమెంటో ప్రాంతీయ స‌మ‌న్వయకర్త పూజ త‌దిత‌రులు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ప్రముఖ పాత్ర పోషించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని