WETA: క్రిస్మస్‌ పురస్కరించుకుని.. చిన్నారులకు ఆట బొమ్మల పంపిణీ

అమెరికాలోని విమెన్ ఎంపవర్‌మెంట్‌ తెలుగు అసోసియేషన్‌ (WETA).. కాలిఫోర్నియా, టెక్సాస్ రాష్ట్రాల్లో చిన్నారులకు బొమ్మలు, దుప్పట్లు పంపిణీ చేసింది.

Published : 30 Dec 2023 17:45 IST

వాషింగ్టన్‌: క్రిస్మస్‌ పురస్కరించుకుని అమెరికాలోని విమెన్ ఎంపవర్‌మెంట్‌ తెలుగు అసోసియేషన్‌ (WETA).. కాలిఫోర్నియా, టెక్సాస్ రాష్ట్రాల్లో చిన్నారులకు ఆటబొమ్మలు, దుప్పట్లు పంపిణీ చేసింది. కాలిఫోర్నియా శాక్రమెంటోలోని ఓ సంరక్షణ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు ఝాన్సీ, అధ్యక్షురాలు శైలజ కల్లూరి పాల్గొన్నారు. రత్నమాల, విశ్వ, పూజ, రేఖ, హైమ, అనురాధ, జ్యోతి, చందన సుధా, సునీత తదితరులతో కలిసి సామగ్రి పంపిణీ చేశారు. టెక్సాస్‌ డల్లాస్‌లోని గుడ్ సమారిటన్‌ షెల్టర్ హోంలో సంఘం సభ్యులు స్మృతి, ప్రతిమ, ప్రశాంతి, సుదీప, సంహితలు పాల్గొన్నారు. చిన్నారుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసేలా ఏటా క్రిస్మస్ సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని సంఘం ప్రతినిధులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని