TDP-Janasena-BJP: సీట్ల కేటాయింపు.. చంద్రబాబు నివాసంలో కీలక భేటీ

ఉండవల్లిలోని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) నివాసంలో కీలక భేటీ కొనసాగుతోంది. సీట్ల సర్దుబాటుపై తెదేపా, భాజపా(BJP), జనసేన (Janasena) ముఖ్య నేతలు కసరత్తు చేస్తున్నారు.

Updated : 13 Mar 2024 18:03 IST

అమరావతి: ఉండవల్లిలోని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) నివాసంలో కీలక భేటీ కొనసాగుతోంది. సీట్ల సర్దుబాటుపై తెదేపా, భాజపా(BJP), జనసేన (Janasena) ముఖ్య నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ మూడు పార్టీల మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో సీట్ల కేటాయింపుపై చర్చించేందుకు చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, భాజపా జాతీయ నేత బైజయంత్‌ పండా హాజరయ్యారు. చర్చల్లో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

పొత్తులో భాగంగా జనసేన, భాజపాకు 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలు కేటాయించినట్లు సమాచారం. ఇప్పటికే 6 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను జనసేన ప్రకటించింది. మరోవైపు భాజపాకు కేటాయించే స్థానాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెదేపా అభ్యర్థులతో ముడిపడి ఉన్న అంశాలు కావడంతో మూడు పార్టీల నేతలు దీనిపై చర్చించి ఒకట్రెండు రోజుల్లో స్పష్టతకు రానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని