CPI Narayana: అమిత్ షాను ఎన్టీఆర్ కలవాల్సిన అవసరమేంటి?: నారాయణ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిహార్ సీఎం నీతీశ్‌ కుమార్‌ను కలవడం మంచి పరిణామమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. కేసీఆర్.. ఏపీ సీఎం

Updated : 01 Sep 2022 16:15 IST

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిహార్ సీఎం నీతీశ్‌ కుమార్‌ను కలవడం మంచి పరిణామమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఏపీ సీఎం జగన్‌ను కూడా భాజపా వ్యతిరేక కూటమిలో చేర్చుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో కలిసి నారాయణ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సినీ నటులను భాజపా ప్రసన్నం చేసుకుంటోందని.. వారి ద్వారా తెరాసను బలహీన పరచాలని చూస్తోందని వ్యాఖ్యానించారు. నటుడు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి గొప్ప రాజకీయ చరిత్ర ఉందని.. ఆయనకు అమిత్ షాను కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని నారాయణ ప్రశ్నించారు.

భాజపా ఓటమే లక్ష్యంగా తెరాసకు మద్దతు: చాడ వెంకట్ రెడ్డి

భాజపా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సీపీఐ పోరాటం చేస్తోందని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని భాజపా వక్రీకరిస్తోందని.. ఇకపై తెలంగాణలో ఆ పార్టీ భాజపా ఆటలు సాగనివ్వబోమని చెప్పారు. మునుగోడులో భాజపాను ఓడించడమే లక్ష్యంగా తెరాసకు మద్దతు ప్రకటించామని చెప్పారు. గుడిసెలు లేని తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేయాలన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్‌ కృషి చేయాలని.. వర్సిటీకి శాశ్వత వీసీని నియమించాలి అని చాడ వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని