Rathod Bapu Rao: భారాసకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా: రాథోడ్‌ బాపూరావు

భారాసకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు తెలిపారు. పార్టీ మార్పుపై అనుచరులతో ఆయన సమాలోచనలు జరిపారు.

Updated : 25 Sep 2023 18:26 IST

ఆదిలాబాద్: భారాసకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు తెలిపారు. పార్టీ మార్పుపై అనుచరులతో ఆయన సమాలోచనలు జరిపారు. ఎమ్మెల్యేగా తప్పు చేయలేదని, పార్టీకి నష్టం చేయలేదని ఆయన అన్నారు. కొంతమంది చెప్పుడు మాటలు విని తనకు టికెట్‌ ఇవ్వలేదని ఆరోపించారు. మరో నాలుగు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని