కుల గణనకు భయమెందుకు?

దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అభిప్రాయపడ్డారు. రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌లో శనివారం నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యకర్తల సదస్సులో ఆయన ప్రసంగించారు.

Updated : 24 Sep 2023 06:41 IST

ప్రధాని మోదీని ప్రశ్నించిన రాహుల్‌
చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌

జైపుర్‌: దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అభిప్రాయపడ్డారు. రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌లో శనివారం నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యకర్తల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇండియా పేరును భారత్‌గా మార్చే ఉద్దేశంతో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చారని, అయితే దానికి బదులు మహిళల రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టారని తెలిపారు. పార్లమెంటు, అసెంబ్లీలలో తక్షణమే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ‘‘ప్రధాని మోదీ ఎల్లవేళలా ఓబీసీల గురించి, వారిని గౌరవించడం గురించి మాట్లాడుతుంటారు. మరి ఆయన కుల గణనకు ఎందుకు భయపడుతున్నారు’’ అని రాహుల్‌ గాంధీ నిలదీశారు.

రాష్ట్రపతిని పిలవకపోవడం అవమానకరం: ఖర్గే

కొత్త పార్లమెంటు భవన శంకుస్థాపన సమయంలో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను మోదీ ప్రభుత్వం ఆహ్వానించలేదని, అంటరాని వ్యక్తి అనే ఉద్దేశంతోనే అహ్వానించలేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. శంకుస్థాపనకు కోవింద్‌ వస్తే గంగా జలంతో శుద్ధి చేయాల్సి వస్తుందనే అలా చేశారని విమర్శించారు. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మునూ పిలవలేదని గుర్తు చేశారు. రెండు సందర్భాలలోనూ రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం అవమానకరమని పేర్కొన్నారు. జైపుర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యకర్తల సదస్సులో మాట్లాడుతూ మల్లికార్జున ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని