రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. కిందిస్థాయిలో పనిచేయాలి

సార్వత్రిక ఎన్నికల్లో 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగ్‌పుర్‌లో భాజపా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

Updated : 25 Mar 2024 06:13 IST

కుమారులకు గడ్కరీ కీలక సూచన

నాగ్‌పుర్‌: సార్వత్రిక ఎన్నికల్లో 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగ్‌పుర్‌లో భాజపా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా తన రాజకీయ వారసత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తన కుమారులు రాజకీయాల్లోకి రావాలనుకుంటే ముందుగా కిందిస్థాయిలో పని చేయాలని సూచించారు. ‘‘ఈ సారి ఎన్నికల్లో నేను ఐదు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానన్న నమ్మకం ఉంది. నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. నాగ్‌పుర్‌ను, ఇక్కడి ప్రజలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా వారసత్వాన్ని భాజపా కార్యకర్త ఎవరైనా కొనసాగించొచ్చు. వాళ్లకు ఆ హక్కు ఉంది. నా కుమారులెవరూ రాజకీయాల్లో లేరు. ఒకవేళ వాళ్లు రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. ముందు కింది స్థాయిలో పోస్టర్లు అంటించాలి. పార్టీ బలోపేతం కోసం కార్యకర్త చేసే పనులన్నీ చేసి సామర్థ్యాన్ని నిరూపించుకుని నా వారసత్వాన్ని అందుకోవాలి’’ అని గడ్కరీ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని