Komatireddy Venkat Reddy: నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా: కోమటిరెడ్డి

తెలంగాణలో రైతులకు.. పేరుకే 24 గంటల విద్యుత్ ఇస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గంట కూడా విద్యుత్‌ను సక్రమంగా ఇవ్వడంలేదని విమర్శించారు.

Updated : 12 Jul 2023 15:06 IST

హైదరాబాద్‌: తెలంగాణలో రైతులకు పేరుకే 24 గంటల విద్యుత్ ఇస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గంట కూడా సక్రమంగా ఇవ్వడంలేదని విమర్శించారు. నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఏ సబ్‌స్టేషన్ వద్దకైనా వెళ్దామని.. నిరంతరాయంగా విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపించాలన్నారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పాటైన రాష్ట్రంలో ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదని ఆరోపించారు.

మూడు గంటలు కావాలా? లేక మూడు పంటల కావాలా? అని కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి మండిపడ్డారు. కావాలని సత్యగ్రహ దీక్షను భగ్నం చేయడానికి భారాస చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. కాంగ్రెస్‌ బలపడుతోందనే భయంతోనే లేని విషయాన్ని ఉన్నట్లుగా సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని