రెండు కాళ్లు విరిచేస్తా.. నీ సంగతి చూస్తా: విశ్వరూప్‌ కుమారుడు ఆడియో కలకలం

మంత్రి విశ్వరూప్‌ కుమారుడు కృష్ణారెడ్డి బెదిరింపుల ఆడియో కలకలం రేపుతోంది. అమలాపురం మండలం ఈదరపల్లి వైకాపా

Updated : 02 Jun 2022 14:15 IST

అమలాపురం: మంత్రి విశ్వరూప్‌ కుమారుడు కృష్ణారెడ్డి బెదిరింపుల ఆడియో కలకలం రేపుతోంది. అమలాపురం మండలం ఈదరపల్లి వైకాపా ఎంపీటీసీ అడపా సత్తిబాబును బెదిరించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అమలాపురంలో గత నెల 24న జరిగిన విధ్వంస ఘటనకు సంబంధించి ఎంపీటీసీ సత్తిబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తమ ఇంటిని తగులబెడతారా అంటూ మంత్రి కుమారుడు.. సత్తిబాబుకు ఫోన్‌ చేసి తీవ్ర స్థాయిలో బెదిరించారు. అసభ్య పదజాలంతో దూషించారు. రెండు కాళ్లు విరిచేస్తానని.. నీ సంగతి చూస్తా అంటూ వైకాపా ఎంపీటీసీని మంత్రి కుమారుడు హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని