Nimmala Rama Naidu: తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి అస్వస్థత

తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అస్వస్థతకు గురయ్యారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో.. పాలకొల్లులోని ఎమ్మెల్యే నిమ్మల ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Updated : 09 Sep 2023 14:15 IST

పాలకొల్లు: తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అస్వస్థతకు గురయ్యారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో.. పాలకొల్లులోని ఎమ్మెల్యే నిమ్మల ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఇంటివద్దకు పోలీసులు చేరుకున్నారు. ఈ క్రమంలో తెదేపా శ్రేణులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో నిమ్మల కిందపడి అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించాలని విజ్ఞప్తి చేసినా పోలీసులు పట్టించుకోలేదని నిమ్మల అనుచరులు ఆరోపిస్తున్నారు. దీంతో రామానాయుడికి ఏం జరిగినా పోలీసులదే బాధ్యతంటూ నినాదాలు చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని