Kuppam: వైకాపాలో వర్గవిభేదాలు.. మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న కార్యకర్తలు

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో వైకాపా వర్గవిభేదాలు బయటపడ్డాయి. మండలానికి చెందిన ముఖ్యనేత దండపాణికి వ్యతిరేకంగా మరో వర్గం ఆందోళనకు దిగింది.

Updated : 13 Sep 2023 10:48 IST

శాంతిపురం: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో వైకాపా వర్గవిభేదాలు బయటపడ్డాయి. మండలానికి చెందిన ముఖ్యనేత దండపాణికి వ్యతిరేకంగా మరో వర్గం ఆందోళనకు దిగింది. మోరసనపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన నేపథ్యంలో ఐదు గ్రామాలకు చెందిన వైకాపా కార్యకర్తలు అక్కడికి చేరుకుని మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దండపాణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రభుత్వ స్థలంలో అధికార పార్టీ నేత ఆక్రమణలను అరికట్టాలంటూ ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు, వైకాపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కుప్పం- పలమనేరు జాతీయ రహదారిపై అసమ్మతి నేతలు బైఠాయించారు. వైకాపా నేతలకు మంత్రి పెద్దిరెడ్డి సర్దిచెప్పి గుడుపల్లి వెళ్లారు. ఇంతకుముందే తమ సమస్యను నియోజకవర్గ నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో పెద్దిరెడ్డి ఎదుట ఆయా గ్రామాల వైకాపా కార్యకర్తలు నిరసనకు దిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని