రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్య మధ్య మరో వివాదం.. ఏం జరిగిందంటే

ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను తప్పించి హార్దిక్‌ పాండ్యను నియమించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన జరిగిన తర్వాత ఇద్దరు క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో ఒకరిని ఒకరు అనుకరించడం లేదనే చర్చ నడుస్తోంది.

Updated : 09 Feb 2024 05:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ (IPL)లో ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ (Rohith Sharma)ను తప్పించి హార్దిక్‌ పాండ్య (Hardik Pandya)ను నియమించడం తీవ్ర చర్చనీయాంశమైంది. గత కొన్ని నెలలుగా ఈ అంశంపై అనేక కథనాలు వస్తూనే ఉన్నాయి. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై  MI కోచ్‌ మార్క్‌ బౌచర్‌ (Mark Boucher) వివరణ ఇచ్చినా దీనిపై అనేక విమర్శలు రావడంతో పాటు రోహిత్‌ భార్య రితికా సైతం స్పందించింది. ఈ ఘటన జరిగిన తర్వాత ఇద్దరు క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో ఒకరిని ఒకరు అనుసరించడం లేదనే చర్చ నడుస్తోంది. దీనిపై ఎలాంటి స్పష్టత లేకున్నా పలువురు ఫ్యాన్స్‌ మాత్రం కామెంట్లు చేస్తున్నారు. రోహిత్‌ కెప్టెన్సీలో ముంబయి ఇండియన్స్‌ ఐదుసార్లు విజేతగా నిలిచింది. అయినా గత డిసెంబరులో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యను జట్టులోకి తీసుకుని కెప్టెన్‌గా నియమించారు. అంతకుముందు హార్దిక్‌ నాయకత్వంలో గుజరాత్‌ టైటాన్స్‌ తన మొదటి సీజన్‌ (2022)లోనే విజేతగా అవతరించింది. గత సంవత్సరంలో రన్నరప్‌గా నిలిచింది. 

అదే హార్దిక్‌ ముందున్న పెద్ద సవాల్‌: ఆకాశ్‌ చోప్రా

కోచ్‌ బౌచర్‌ మాట్లాడుతూ రోహిత్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తే పూర్తి సమయాన్ని బ్యాటింగ్‌పై కేటాయించి మరింత మెరుగ్గా ఆడతాడని జట్టు ఆశిస్తోందన్నాడు. ఈ వ్యాఖ్యలపై రోహిత్‌ భార్య రితికా సాజెద్‌ స్పందిస్తూ ఫ్రాంచైజీలో అంతా బాగాలేదని ఆమె వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ముంబయి జట్టును హార్దిక్‌ సమర్ధవంతంగా నడిపిస్తాడా అని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌చోప్రా అన్నాడు. ‘‘ఏది తప్పో, ఏది ఒప్పో తెలియదు. కానీ ముంబయి జట్టు పేపర్‌పై మాత్రం అద్భుతంగా ఉంది. ఆటగాళ్లందరినీ సమన్వయపరిచి జట్టును ముందుకు నడిపించడమే హార్దిక్‌ పాండ్య ముందున్న పెద్ద సవాల్‌’’అని ఆకాశ్‌ చోప్రా అన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని