ICC Test Rankings: అగ్రస్థానంలోకి అశ్విన్‌.. మళ్లీ టాప్‌-10లోకి వచ్చేసిన రోహిత్ శర్మ

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్ తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 

Published : 13 Mar 2024 18:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టుతో టీమ్‌ఇండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) 100 టెస్టుల క్లబ్‌లో చేరాడు. ఈ ప్రత్యేకమైన మ్యాచ్‌లో అశ్విన్‌ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి చిరస్మరణీయం చేసుకున్నాడు. ఈ ప్రదర్శన ద్వారా ఐసీసీ టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో అతడు తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. అశ్విన్‌ 870 పాయింట్లతో జస్‌ప్రీత్‌ బుమ్రా (847 పాయింట్లు)ను వెనక్కినెట్టి టాప్‌లోకి దూసుకొచ్చాడు. బుమ్రా, జోష్‌ హేజిల్‌వుడ్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. రవీంద్ర జడేజా (788 పాయింట్లు) ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. 

కుల్‌దీప్‌ యాదవ్‌ ఏకంగా 15 స్థానాలు ఎగబాకి 16వ స్థానంలో నిలిచాడు. టెస్టు కెరీర్‌లో అతడికి అత్యుత్తమ ర్యాంకు. ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టులో శతకం బాదిన రోహిత్ శర్మ (Rohit Sharma) తిరిగి టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. అతడు ఆరు స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ బ్యాటర్ కేన్‌ విలియమ్సన్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. యశస్వి జైస్వాల్ రెండు స్థానాలు మెరుగై ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ధర్మశాల టెస్టులో సెంచరీ చేసిన శుభ్‌మన్‌ గిల్ 11 స్థానాలు ఎగబాకి కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకు (20) అందుకున్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని