Sunil Gavaskar: దేశానికి ఆడటం వల్లే పేరు: సునీల్‌ గవాస్కర్‌

ఆకలి ఉన్న వారికే అవకాశాలు అన్న రోహిత్‌ శర్మ వ్యాఖ్యాలను సునీల్‌ గవాస్కర్‌ సమర్ధించాడు. భారత క్రికెట్‌పట్ల విధేయత కలిగి ఉండాలని ఆటగాళ్లకు సూచించాడు.

Published : 27 Feb 2024 16:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెస్టు క్రికెట్‌ ఆడే ఆకలి లేని క్రికెటర్లను జాతీయ జట్టులో చేర్చుకోకూడదన్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) వ్యాఖ్యలను భారత దిగ్గజ బ్యాటర్‌ సునీల్ గవాస్కర్‌ (Sunil Gavaskar) సమర్ధించాడు. 
‘‘రోహిత్‌ చెప్పింది పూర్తిగా నిజం. టెస్టు క్రికెట్‌ ఆడాలనుకునే వారినే ఎంపిక చేయండి. ఇది నేను ఎప్పటినుంచో చెబుతున్నాను. భారత క్రికెట్‌ వల్లే ప్రతి ఆటగాడికి పేరు, డబ్బు, గుర్తింపు వచ్చాయి. భారత క్రికెట్‌ పట్ల ప్రతి ఆటగాడు విధేయత చూపాలి. ఎవరైనా ఏ కారణం చేతనైనా  పదే పదే దేశానికి ఆడను అని అంటే కచ్చితంగా యువ ఆటగాళ్లకు మరిన్ని ఎక్కువ అవకాశాలివ్వాలి. ఇలాంటి వైఖరిని సెలెక్టర్లు అలవర్చుకుంటే భారత క్రికెట్‌కు అది మేలు చేస్తుంది. ’’ అని గవాస్కర్‌ అన్నాడు. 

రాంచీలో నాలుగో టెస్టు విజయం సాధించి సిరీస్‌ సొంతం చేసుకున్న తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ ‘‘ఎవరికైతే ఆకలి ఉందో వాళ్లకే అవకాశాలు ఇస్తాం. టెస్టుల్లో తక్కువ అవకాశాలే వస్తాయి. వాటిని ఉపయోగించుకోలేని వాళ్లు బయటికి వెళ్లిపోతారు. టెస్టు క్రికెట్‌ అత్యంత కఠినమైంది. అందులో విజయవంతం కావాలంటే ఎంతో తపన ఉండాలి. అది ఉన్న వాళ్లకే ప్రాధాన్యం ఇస్తాం’’ అని అన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని