Ishan Kishan: అందరికీ విజ్ఞప్తి.. ఎక్కడపడితే అక్కడ వాటర్ బాటిళ్లు విసరొద్దు: ఇషాన్ కిషన్

ఐపీఎల్ కోసం ప్రాక్టీస్‌కు వస్తున్న చేస్తున్న ఆటగాళ్ల ఇషాన్‌ కిషన్ ఓ విజ్ఞప్తి చేశాడు. 

Updated : 20 Mar 2024 16:01 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌లో (IPL) ఇప్పుడందరి దృష్టి ఇషాన్ కిషన్‌పైనే (Ishan Kishan) ఉంది. సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయి బీసీసీఐ ఆగ్రహానికి గురైన ఇషాన్‌ ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ముంబయి ఇండియన్స్‌ జట్టుతో ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ విజ్ఞప్తి చేస్తూ పోస్టు పెట్టాడు. ‘‘ప్రతి ఒక్కరూ ఇక్కడికి ప్రాక్టీస్‌ చేసుకోవడానికి వస్తున్నారు. ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు వస్తారు. అయితే ఎవరూ కూడానూ ఎక్కడపడితే అక్కడ మంచినీళ్ల సీసాలను పడేయొద్దు. మైదానం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం. ఇవన్నీ చిన్న విషయాలే. మనం నిరంతరం మెరుగుపర్చుకోవాలి. కొన్ని మార్పులు చాలా ముఖ్యం. అవన్నీ మనం చేయగలిగినవే’’ అని కిషన్ పేర్కొన్నాడు. 

మదుషంకకు గాయం.. 

మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ముంబయి ఇండియన్స్‌కు షాక్‌ తగిలింది. శ్రీలంక ఫాస్ట్‌ బౌలర్ దిల్షాన్ మదుషంకకు గాయమైంది. బంగ్లాదేశ్‌తో రెండో వన్డే సందర్భంగా తొడకండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో మూడో వన్డే నుంచి వైదొలిగాడు. ఎంఆర్‌ఐ స్కానింగ్‌ అనంతరం అతడి గాయం పరిస్థితి తెలియనుంది. ‘‘మదుషంక బంగ్లా సిరీస్‌‌లో గాయపడ్డాడు. అతడిని వెంటనే రిహాబిలిటేషన్‌కు పంపించాం. స్కానింగ్‌ అనంతరం ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన చేస్తాం’’ అని శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. ముంబయి ఇండియన్స్‌ గత ఐపీఎల్ వేలంలో రూ. 4.60 కోట్లకు అతడిని దక్కించుకుంది. మార్చి 24న గుజరాత్‌ టైటాన్స్‌తో ముంబయి తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని