Smart phone Tips: వేసవిలో స్మార్ట్ ఫోన్లు వేడెక్కుతున్నాయా? ఈ జాగ్రత్తలు పాటించండి!
స్మార్ట్‌ఫోన్ పేలి ప్రమాదాలు జరిగే అవకాశం వేసవిలోనే అధికం. మరి ఈ కాలంలో యూజర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం..
‘ఛార్జింగ్ పెట్టిన మా వాళ్ల ఫోన్ బాగా వేడెక్కి పేలిపోయిందట, ఈ మధ్య నా ఫోన్ బాగా హీట్ అవుతోంది’.. ఈ మధ్య ఇలాంటి మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇలాంటి సమస్యలు వేసవిలోనే ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో మొబైల్ యూజర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?అలాగే బ్యాటరీ సేవింగ్స్ టిప్స్‌పై కూడా ఓ లుక్కేయండి మరి.
సూర్యకాంతి పడకుండా (Direct Sunlight): మనం ఇంట్లో ఉన్నపుడు ఉష్ణోగ్రత ఒకలా.. బయటకు వెళ్లినపుడు మరోలా ఉంటుందనే విషయం తెలిసిందే. ఎండ తగలకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో ఫోన్ విషయంలో అంతే జాగ్రత్తపడాలట. ఎండలో స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తే అది ఇంకా వేడెక్కిపోతుంది. కాబట్టి సూర్యకాంతి మొబైల్‌పై నేరుగా పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఛార్జర్ విషయంలోనూ (Certified Chargers): వాడే ఛార్జర్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఛార్జర్ పాడైందని మార్కెట్లో ఏది పడితే అది కొనొద్దని చెబుతున్నారు. కంపెనీ ఛార్జర్లు మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. ఒకవేళ కంపెనీ ఛార్జర్లు పాడైతే అదే కంపెనీకి చెందిన ఒరిజినల్ ఛార్జర్లను మాత్రమే కొనుగోలు చేయాలని చెబుతున్నారు.
పగిలిన స్మార్ట్‌ఫోన్‌తో జాగ్రత్త (Damaged Phones): అనుకోకుండా ఫోన్ పగిలినా, చిన్న డ్యామేజ్ అయినా... రిపేర్ చేయించకుండా కొందరు అలానే వాడేస్తుంటారు. అది ఇది ఏ మాత్రం మంచిది కాదంటున్నారు. డ్యామేజ్ అయిన స్మార్ట్ఫోన్లు వేగంగా వేడెక్కి, పేలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందట. కాబట్టి వీలైనంత త్వరగా రిపేర్ చేయించుకున్నాకే వాడడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
అతిగా ఛార్జ్ చేస్తున్నారా? (overcharge): చాలా మంది నిద్రపోయే ముందు ఫోన్ ఛార్జింగ్ పెటడుతుంటారు. రాత్రంతా ఛార్జ్ పెట్టి, ఉదయాన్నే లేచాక తీసేస్తారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. గంటలు గంటలు ఫోన్ ఛార్జ్ పెడితే ఫోన్ బ్యాటరీ సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందంటున్నారు. కాబట్టి బ్యాటరీ 90 నుంచి 100 లోపు ఛార్జ్ అయ్యాక తీసేయాలి. తాజాగా వచ్చే స్మార్ట్ఫోన్లలో ఆటోమేటిక్ పవర్ సప్లయ్ ఫీచర్ ఉంటుంది. దాన్ని టర్న్ ఆన్ చేసుకుంటే సరి. నిర్దేశించిన ఛార్జింగ్ తర్వాత ఆటోమేటిగ్గా ఛార్జింగ్ అగిపోతుంది.
టర్న్ ఆఫ్ చేసుకోవాలి (Turn Off Location Services, Bluetooth): కొంతమంది బ్లూటూత్, లోకేషన్ సర్వీసెస్ వంటి ఫీచర్లు ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంచుతారు. స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్ హెడ్సెట్ వాడకం పెరిగిపోవడంతో వీటిని టర్న్ ఆఫ్ చేయడమే మర్చిపోతున్నారు. అవసరం లేనపుడు ఈ ఆప్షన్లను టర్నాఫ్ చేయడమే మంచిదని చెబుతున్నారు. లేదంటే ఫోన్‌పై ఎక్కువ లోడ్ పడుతుందని.. బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
స్క్రీన్ బ్రైట్నెస్ (Screen Brightness): స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ బ్రైట్నెస్ కూడా బ్యాటరీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. వీలైనంత వరకు దీన్ని తక్కువలో ఉంచడమే మంచిది. అయితే, ఇప్పుడు వచ్చే స్మార్ట్ఫోన్లలో ఆటోమేటిక్ స్క్రీన్ బ్రైట్నెస్ మోడ్‌ను ఇస్తున్నారు. దీన్ని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది.
అనవసరపు యాప్‌లు... (Unused Apps): పై టిప్స్‌తోపాటు మొబైల్లో వాడని యాప్స్‌ను వెంటనే డిలీట్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఆ యాప్స్‌ను ఉపయోగించకపోయినా బ్యాగ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. దీనివల్ల బ్యాటరీ సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి వీటిని వెంటనే డిలీట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల స్మార్ట్‌ఫోన్‌పై లోడ్ తగ్గడమే కాకుండా ఫోన్ స్పేస్ కూడా ఆదా అవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెబ్క్యామే స్కానర్
డెస్క్‌టాప్ ఉంది గానీ స్కానర్ లేదా? పోనీ వెబ్‌క్యామ్ అయినా ఉందా? అయితే దీన్నే స్కానర్‌లా వాడుకుంటే సరి. మ్యాక్‌లోనైతే- ఫొటో బూత్‌ను ఓపెన్ చేసి, డాక్యుమెంట్‌ను వెబ్‌క్యామ్ ముందుకు తీసుకురావాలి. -
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా వచ్చింది
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్ అకౌంట్ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్ 17.5 స్టేబుల్ వర్షన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. -
బహుబలి కెమెరా
అమెరికాలోని ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలేటర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు. -
పిక్సెల్ ఫోన్లలో లుకప్ ఫీచర్
గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడేవారికి శుభవార్త. తెలియని నంబర్ల నుంచి కాల్ చేసే వారిని గుర్తించే లుకప్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీన్ని ఇంతకుముందు జపాన్‌లో పరిచయం చేశారు గానీ ఇతర ప్రాంతాల్లో విడుదల చేయలేదు. -
మొబైల్ రోబో
వినూత్న ఫీచర్లతో కూడిన కొత్త టూల్స్‌తో టెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. అలాంటి టూల్ ఒకటి ఇటీవలే విడుదలైంది. దీని పేరు ఎల్ఓఓఐ. ఇదో చిన్న డెస్క్‌టాప్ రోబో. -
మిమిక్రీ ఇంజిన్!
ప్రముఖ కృత్రిమ మేధ కంపెనీ ఓపెన్ఏఐ తాజాగా వాయిస్ అసిస్టెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా వాయిస్ ఇంజిన్ అనే వినూత్న టూల్‌ను పరిచయం చేసింది. -
కొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్‌టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
ఐఫోన్ కిటుకులు
ఐఫోన్లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్‌కు అప్డేట్ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు. -
ఫొటో కటౌట్ చిటికెలో
ఫొటోలో వెనక దృశ్యాలను తొలగించి, కటౌట్ చేయటం పెద్ద పని. అడోబ్ ఫొటోషాప్, ఏఐ టూల్స్ వంటి అధునాతన సాధనాలు అవసరం. -
సెల్ సర్వీసు మొరాయిస్తే?
ఎప్పుడైనా సెల్‌ఫోన్ సర్వీసు సరిగా పనిచేయకపోతే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టి, కాసేపు వేచి చూడాలి. తర్వాత ఫోన్‌ను యథాస్థితికి తేవాలి. దీంతో ఫోన్ సమీపంలోని సెల్ టవర్‌తో కనెక్ట్ అవుతుంది -
పాస్వర్డ్ మేనేజర్ భద్రమేనా?
భద్రత, బ్యాకప్ టూల్స్‌గా పాస్వర్డ్ మేనేజర్స్ ఉపయోగపడతాయి. వీటితో పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవటం, ప్రతీసారీ పాస్‌వర్డ్‌ను టైప్ చేయటం తప్పుతాయి. కానీ చాలామంది వీటిని వాడుకోరు. హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను దొంగిలించే ప్రమాదముందని భావించటం దీనికి ఒక కారణం. అందువల్ల ఇవి మంచివేనా? అనే అనుమానం కలుగుతుంటుంది. -
ఐఫోన్‌కు మరింత భద్రత
యాపిల్ సంస్థ ఐఓఎస్ 17.3 బీటాతో ఐఫోన్ల కోసం గొప్ప భద్రత ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని పేరు స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. పేరుకు తగ్గట్టుగానే ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినప్పుడు యాపిల్ ఖాతాను కాపాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐఫోన్ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. -
ఇక మొబైల్ ఫోనే టీవీ
రేడియో, ఫోన్లలోని రిసీవర్ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్ ఫోన్లో యూట్యూబ్‌లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం. -
పాత ప్రింటర్‌ను అమ్ముతున్నారా?
ప్రింటర్‌తో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ప్రింట్ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ రహస్య సమాచారంతో కూడిన పత్రాలనూ ప్రింట్ చేస్తుంటాం. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. -
నచ్చిన ఫొటోల స్లైడ్‌షో
ఇష్టమైన ఫొటోలను స్లైడ్ షోగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. విండోస్ పీసీ వాడేవారు తమకు తామే దీన్ని సృష్టించుకోవచ్చు. నచ్చిన వాల్పేపర్లు, ఫొటోలను ఒక ఫోల్డర్లో వేయాలి. -
ఫొటో అసలుదేనా?
ఆన్లైన్లో ఎన్నో ఫొటోలు. అన్నీ అసలువే కాకపోవచ్చు. కొన్ని నకిలీ ఫొటోలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ఫొటోలతో ఈ బెడద మరింత ఎక్కువైంది కూడా. -
కీబోర్డు మీద వేళ్ల ప్రయాణం!
కీబోర్డు మీద చకచకా టైప్ చేస్తుంటాం గానీ ఆ సమయంలో చేతి వేళ్లు ఎంత దూరం ప్రయాణించాయో ఎప్పుడైనా లెక్కించారా? చేతి వేళ్లు ప్రయాణించటమేంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు. -
వినూత్నం మృదు రోబో
ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్ కరోలీనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు. ట్విస్టెట్ రింగ్‌బాట్స్‌ను రూపొందించి సంచలనం సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే