WhatsApp: అపరిచితుల వాట్సప్‌ గ్రూపులో చేరకుండా..

మనకు తెలియకుండా, మన అనుమతి లేకుండా వాట్సప్‌ గ్రూప్‌లో మన కాంటాక్ట్‌ నంబర్‌ను జోడిస్తే? అది మనకు ఇష్టంలేని విషయాలను చర్చించే వేదికైతే? ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. మరెలా?

Updated : 11 Aug 2021 16:34 IST

మనకు తెలియకుండా, మన అనుమతి లేకుండా వాట్సప్‌ గ్రూప్‌లో మన కాంటాక్ట్‌ నంబర్‌ను జోడిస్తే? అది మనకు ఇష్టంలేని విషయాలను చర్చించే వేదికైతే? ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. మరెలా?

మన వ్యక్తిగత గోప్యతను కాపాడటానికి వాట్సప్‌లో ఎన్నో సెటింగ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ప్రొఫైల్‌ ఫొటోలు, చివరిసారి చూసిన స్టేటస్‌ కనిపించకుండా చేయటం వంటివన్నీ ఇలాంటివే. గ్రూపుల విషయంలోనూ ఇటువంటి రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి. అయితే ఎవరైనా ఎవరినైనా ఏ గ్రూపులోనైనా చేర్చే అవకాశం లేకపోలేదు. ముందే సెటింగ్స్‌లో మార్పులు చేసుకుంటే దీన్నుంచి పూర్తిగా తప్పించుకోవచ్చు.

* ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో వాట్సప్‌ వాడేవారు ముందుగా కుడివైపున అన్నింటికన్నా పైన ఉండే మూడు చుక్కల మెనూ ద్వారా సెటింగ్స్‌లోకి వెళ్లాలి.

* వాట్సప్‌ సెటింగ్స్‌ మెనూలో అకౌంట్‌ సెటింగ్స్‌ను నొక్కాలి. తర్వాత ప్రైవసీ విభాగంలో గ్రూప్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

* గ్రూప్‌ విభాగంలో డిఫాల్ట్‌గా ‘ఎవ్రీవన్‌’ ఆప్షన్‌ సెలెక్ట్‌ అయ్యింటుంది. ఇదిలాగే ఉంటే మన కాంటాక్ట్‌ నంబరు గలవారు ఎవరైనా గ్రూప్‌లో చేర్చే అవకాశముంటుంది. అందువల్ల ‘మై కాంటాక్ట్‌’ గానీ ‘మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్‌’ను గానీ ఎంచుకోవటం మంచిది. దీంతో అపరిచితులు, కాంటాక్టు జాబితాలో లేనివారు మనల్ని గ్రూపుల్లో చేర్చనీయకుండా నివారించుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని