గురూ.. ఇది ఫేస్‌బుక్‌ ‘టిక్‌టాక్‌’

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్ షార్ట్‌ వీడియో ప్రియుల కోసం బార్స్‌ (BARS) పేరుతో సరికొత్త యాప్‌ను విడుదల చేసింది. టిక్‌టాక్ తరహా ఫీచర్స్‌తో కొత్తగా ర్యాప్‌ రంగంలోకి అడుపెట్టాలనుకునే వారి కోసం ఈ యాప్‌ను డిజైన్ చేశారు.... 

Published : 01 Mar 2021 10:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్ షార్ట్‌ వీడియో ప్రియుల కోసం బార్స్‌ (BARS) పేరుతో సరికొత్త యాప్‌ను విడుదల చేసింది. టిక్‌టాక్ తరహా ఫీచర్స్‌తో కొత్తగా ర్యాప్‌ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే వారి కోసం ఈ యాప్‌ను డిజైన్ చేశారు. బార్స్‌లోని ఫీచర్స్‌ సాయంతో యూజర్స్‌ సులభంగా ర్యాప్‌ వీడియోలను రూపొందించి షేర్ చేసుకోవచ్చు. ఇందులోని ప్రీ-రికార్డెడ్‌ ఫీచర్‌తో మన సొంత పదాలకు ప్రొఫెషనల్‌‌ ర్యాప్‌ స్టైల్ వీడియోను రూపొందించొచ్చు. ఈ యాప్‌లో రైమింగ్ డిక్షనరీ, ఛాలెంజ్‌ మోడ్ ఉన్నాయి. ఇవి ర్యాపర్ వీడియో రూపొందించేప్పుడు ఫ్లో ఆగిపోకుండా అవసరమైన పదాలను సూచిస్తాయి. వీడియో రికార్డింగ్ పూర్తయిన తర్వాత దాన్ని మరింత మెరుగుపరిచేందుకు వివిధ రకాల ఆడియో/వీడియో ఫిల్టర్స్‌ ఉన్నాయి. వాటితో పాటు క్లీన్, ఆటో ట్యూన్, ఇమేజినరీ ఫ్రెండ్స్‌, ఏమ్‌ రేడియో వంటి టూల్స్‌తో వీడియోలోని  వాయిస్‌లో మార్పులు చెయ్యొచ్చు.     

ఇవేకాకుండా ఈ యాప్‌లో వందలాది బీట్స్‌ ఉన్నాయి. యూజర్స్ వీటిలో ఒకదాన్ని ఎంచుకుని ర్యాప్‌ వీడియోను సిద్ధం చేసుకోవచ్చు. వీడియో రికార్డ్ చేసిన తర్వాత దాన్ని ఫోన్ గ్యాలరీలో లేదా సోషల్ మీడియాలో షేర్ చేసుకునే సదుపాయం ఉంది. బార్స్‌ యాప్‌ను ఫేస్‌బుక్‌కు చెందిన న్యూ ప్రొడక్ట్ ఎక్స్‌పరిమెంటేషన్ (ఎన్‌పీఈ) ఆర్‌&డీ బృందం ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ యాప్ అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అన్ని రీజియన్లలో విడుదల చేస్తారని బార్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది.  గతంలో కూడా ఫేస్‌బుక్ ఎన్‌పీఈ బృందం కొలాబ్‌ పేరుతో మ్యూజిక్ వీడియో యాప్‌ను రూపొందించింది. టిక్‌టాక్‌పై నిషేధం తర్వాత యూజర్స్ ప్రత్యామ్నాయ యాప్‌లపై దృష్టి సారించారు. ఇప్పటికే యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సంస్థలతో పాటు ఫేస్‌బుక్ కూడా షార్ట్‌ వీడియోల కోసం ప్ర్యతేక ఫీచర్స్‌ను తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో బార్స్‌ ఎంత మేర యూజర్స్‌ని ఆకట్టుకుంటుందనేది వేచి చూడాల్సిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని