గూగుల్ వెతుకులాటలో కొత్తగా..
ఏ సందేహం వచ్చినా గూగుల్‌పై వాలిపోతాం. వెతికేస్తాం. ఈ క్రమంలో గూగుల్ కూడా సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది. వాటిల్లో డార్క్‌మోడ్, ఇన్ఫోకార్డులు ఆన్లైన్ సెర్చ్ సర్వీసులో సందడి
ఏ సందేహం వచ్చినా గూగుల్‌పై వాలిపోతాం. వెతికేస్తాం. ఈ క్రమంలో గూగుల్ కూడా సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది. వాటిల్లో డార్క్‌మోడ్, ఇన్ఫోకార్డులు ఆన్లైన్ సెర్చ్ సర్వీసులో సందడి చేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా మరికొన్ని ఫీచర్లను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ప్రత్యేకంగా వాటిని వాడుకోవచ్చు. పాఠ్యాంశాలకు సంబంధించినవి వెతికే క్రమంలో కొత్తగా జత చేసినవి ఎంతో ఉపయోగపడతాయి. సెర్చ్ ఫలితాల్ని భిన్నంగా మార్చేస్తాయి. ఇంతకీ విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఫీచర్ల సంగతులేంటో చూద్దామా..
ఇంటరాక్టివ్ క్విజ్లు
గూగుల్‌లో ఏదైనా వెతికితే బోల్డన్ని వెబ్ పేజీలు కుప్పలుగా వచ్చేస్తాయి. వాటిల్లో కావాల్సిన వాటిని వెతికి ఓపెన్ చేస్తాం. ఇలా పదే పదే కళ్లు కాయలు కాసేలా సెర్చ్ రిజల్ట్‌లను వెతికే పని లేకుండా విద్యార్థులు వినూత్నంగా గూగుల్ సెర్చ్ చేసేలా ‘ఇంటరాక్టివ్ క్విజ్’లు జత అయ్యాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్.. వాటిని ఇట్టే యాక్సెస్ చేయొచ్చు. కరోనా కారణంగా చదువులు ఇంటికే పరిమితం అయిన నేపథ్యంలో గూగుల్ ఈ తరహా రిమోట్ లెర్నింగ్కి అవకాశం కల్పిస్తోంది. అదెలాగంటే.. గూగుల్ సెర్చ్‌లోకి వెళ్లి Physics Practice Problems అని ఎంటర్ చేసి చూడండి. సెర్చ్ రిజల్ట్‌ల ప్రారంభంలో చూడండి. ప్రత్యేక ఫార్మాట్లో క్విజ్లు కనిపిస్తాయి. పలు ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్‌లు అందించే వాటిని ఒక్కొక్కటిగా యాక్సెస్ చేయొచ్చు. క్విజ్‌లకు మీరిచ్చే సమాధానాల ఆధారంగా ఆయా పాఠ్యాంశాలపై మీకెంత పట్టు ఉందో తెలుసుకోవచ్చు. Trigonometry Problems అనే కీవర్డ్‌తో గణితశాస్త్ర ప్రశ్నలతో కూడిన పజిల్ని చూడొచ్చు. సాధన చేయొచ్చు.
అగ్మెంటెడ్ రియాలిటీ..
వాస్తవ ప్రపంచాన్ని వర్చువల్ వరల్డ్‌ని టెక్నాలజీ మిళితం చేసేస్తోంది. దానికి నిదర్శనమే అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్). ఎలాంటి అదనపు యాక్ససరీస్‌తో అవసరం లేకుండా.. కేవలం మీరు వాడుతున్న స్మార్ట్ ఫోన్‌తోనే ఏఆర్‌ని యాక్సెస్ చేయొచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో ఈ ఏఆర్ టెక్నాలజీని వాడుకుని రిమోట్ లెర్నింగ్‌ని మరింత వినూత్నంగా మార్చేయొచ్చు. ఎంపిక చేసుకున్న అంశాల్ని 3డీలో చూడడంతో మీరున్న చోటే ఏఆర్లోనూ ప్రదర్శించి చూడొచ్చు. ఉదాహరణకు రసాయన శాస్త్రంలోని ‘కెమికల్ బాండ్’ గురించి చూద్దాం అనుకుంటే.. ఫోన్లోని గూగుల్ సెర్చ్‌లో chemical bond కీవర్డ్‌ని ఎంటర్ చేయండి. సెర్చ్ ఫలితాల్లో ‘వ్యూ ఇన్ 3డీ’ కనిపిస్తుంది. ట్యాప్ చేసి 3డీలో చూడొచ్చు. ఒకవేళ మీ ఫోన్లో ఏఆర్ సపోర్టు ఉంటే.. ‘వ్యూ ఇన్ యువర్ ప్లేస్’ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి ఉన్నచోటే ఏఆర్‌లో కెమికల్ బాండ్ డయాగ్రామ్ని చూడొచ్చు. ఇదే మాదిరిగా భౌతికశాస్త్రానికి సంబంధించిన పాఠ్యాంశాల్ని 3డీ, ఏఆర్‌ని వాడుకుని చదువుకోవచ్చు. ఇప్పటికైతే ఈ మొత్తం రిమోట్ లెర్నింగ్ ఇంగ్లిష్ భాషలోనే అందిస్తున్నారు. త్వరలో ఇతర ప్రాంతీయ భాషల్లోనూ గూగుల్ అందించేందుకు సిద్ధం అవుతోంది. డెస్క్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లలోనూ ఈ గూగుల్ సెర్చ్ ఫీచర్స్‌ని యాక్సెస్ చేయొచ్చు. వీటితో పాటు మరికొన్ని స్క్రీన్ రీడర్స్‌ని అందించే పనిలో ఉంది. దీంతో అంధులు ఇతరుల సాయం లేకుండానే రిమోట్ లెర్నింగ్ సేవల్ని వాడుకోవచ్చు.
ఇదో స్క్రీన్ రీడర్..
ఎక్కువ సమయం పాటు ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి. దీంతో పాఠ్యాంశాల గురించో.. పలు రకాల ఇతర అంశాల గురించో కంప్యూటర్లో వెతుకుతుంటాం. అలాంటప్పుడు ఎక్కువగా చదవాల్సివస్తుంది. ఇలా స్క్రీన్‌ను ఎక్కువ సమయం చూడడం వల్ల కళ్లు ఒత్తిడికి లోనవుతుంటాయి. అలాంటప్పుడు వెబ్ పేజీల్లో ఉన్న పాఠ్యాంశాలు, వ్యాసాల్ని కంప్యూటరే చదివి వినిపిస్తే! కళ్లు మూసుకుని హాయిగా వినొచ్చు. ఇక అంధులకు అయితే ఈ తరహా స్క్రీన్ రీడర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే క్రోమ్ యూజర్లు ప్రత్యేక ఎక్స్టెన్షన్ని ప్రయత్నించొచ్చు. అదే Pericles: Text to Speech Screen Reader: క్రోమ్ వెబ్ స్టోర్ నుంచి బ్రౌజర్‌కి జత చేయవచ్చు. అప్పుడు ప్రత్యేక ఐకాన్ గుర్తు అడ్రస్‌బార్ పక్కన ఉన్న టూల్‌బార్‌లో కనిపిస్తుంది. ఇక ఎప్పుడైనా వెబ్ పేజీలోని కంటెంట్‌ని విందాం అనుకుంటే ఎక్స్టెన్షన్ ఐకాన్‌పై క్లిక్ చేస్తే చాలు. వాయిస్‌ని కావాల్సినట్టుగానే మేనేజ్ చేసుకోవచ్చు. అంటే.. వేగం తగ్గించుకుని నెమ్మదిగా చదివేలా సెట్ చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెదడులాంటి కంప్యూటర్!
మనిషి మెదడులా పనిచేసే, ఒకే సమయంలో వేర్వేరుగా స్పందించే కంప్యూటర్లను రూపొందించాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా ఇంటెల్ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద న్యూరోమార్ఫిక్ కంప్యూటర్ను రూపొందించారు. -
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్‌వాచ్‌ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
‘కీప్’ గోయింగ్!
రోజురోజుకీ నోట్-టేకింగ్ యాప్స్‌కు ఆదరణ పెరుగుతోంది. వివిధ ప్రయోజనాలు ఉండటంతో యువత వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు బోలెడన్ని ఉచిత నోట్ టేకింగ్ యాప్‌లూ అందుబాటులో ఉన్నాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
అమెజాన్ మ్యూజిక్‌లో ఏఐ ప్లేలిస్టు ఫీచర్
సంగీత ప్రియులను ఆకట్టుకోవటానికి మ్యూజిక్ యాప్‌లు కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. స్పోటిఫై ఇటీవల ప్రీమియం యూజర్ల కోసం ఏఐ ఆధారిత ప్లేలిస్ట్ జనరేటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. -
వాట్సప్ ఛాట్ ఫిల్టర్
వాట్సప్ గత కొన్నిరోజులుగా గోప్యతను కాపాడుతూనే ఎన్నో వినూత్న ఫీచర్లు పరిచయం చేస్తోంది. ఎక్కువ మందికి మెటా ఏఐని అందుబాటులోకి తేవటం దగ్గరి నుంచి యాప్ నుంచే బస్ టికెట్లు కొనుక్కోవటానికి వీలు కల్పించటం వరకూ ఎన్నో సదుపాయాలను ఆరంభించింది. -
వెబ్‌లోనూ ట్రూకాలర్
స్మార్ట్ఫోన్లలో ట్రూకాలర్‌ను చాలాకాలంగా వాడుతూనే ఉన్నాం. అజ్ఞాత, స్పామ్ కాల్స్‌ను గుర్తించటానికిది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడిది వెబ్ బ్రౌజర్ రూపంలోకీ మారింది. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
వెబ్క్యామే స్కానర్
డెస్క్‌టాప్ ఉంది గానీ స్కానర్ లేదా? పోనీ వెబ్‌క్యామ్ అయినా ఉందా? అయితే దీన్నే స్కానర్‌లా వాడుకుంటే సరి. మ్యాక్‌లోనైతే- ఫొటో బూత్‌ను ఓపెన్ చేసి, డాక్యుమెంట్‌ను వెబ్‌క్యామ్ ముందుకు తీసుకురావాలి. -
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు. -
జీపీటీ దృష్టి!
టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఛాట్‌జీపీటీ పేరు మార్మోగుతోంది. ఆరంభమైనప్పటి నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. రోజురోజుకీ కొత్త పోకడలు పోతోంది. ఆన్లైన్లో టెక్స్ట్‌ను సంగ్రహించి, మథించటంతోనే ఆగిపోలేదు. -
హాయ్ ఐయామ్ నమో ఏఐ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీ వాడకంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన వ్యక్తిగత నమో యాప్ గురించి తెలిసిందే. దీనికి తాజాగా కృత్రిమ మేధతో కూడిన నమో ఏఐ ఫీచర్ కూడా జతచేరింది. -
ఆండ్రాయిడ్ పరికరాల్లో సరికొత్త ఫొటో ఎడిటింగ్
డిజిటల్ ప్రపంచం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ పరికరాలూ కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. వీటికి త్వరలో కొత్త ఏఐ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. -
రోడ్డు గుంతలను పూడ్చే రోబో
గుంతలు లేని రోడ్లను ఒకసారి తలచుకోండి. ఆ ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో! ఊహించుకుంటేనే ఎంత సంతోషం కలుగుతుందో కదా. అదే నిజమైతే? అది సాకారం కావటం మరెంతో దూరంలో లేదు. -
అశ్లీల బెదిరింపుల వలలో పడకుండా
ఆన్లైన్లో నగ్న చిత్రాలు, వీడియోలతో బెదిరించటాన్ని అడ్డుకోవటానికి ఇన్స్టాగ్రామ్ కొత్తగా న్యూడిటీ ప్రొటెక్షన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇన్స్టాగ్రామ్ డీఎంలలో ఉండే ఈ ఫీచర్ దానంతటదే నగ్న చిత్రాలను పసిగడుతుంది. -
పాటలు నేర్పే పదనిస
హిందీ పాటలు పాడటం నేర్చుకోవాలని భావిస్తున్నారా? కానీ సమయం దొరకటం లేదని చింతిస్తున్నారా? అయితే పదనిస యాప్‌ను ప్రయత్నించి చూడండి. ప్రముఖ సంగీత కంపెనీ సరిగమ ఇటీవలే దీన్ని తీసుకొచ్చింది. -
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా వచ్చింది
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్ అకౌంట్ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్ 17.5 స్టేబుల్ వర్షన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. -
కాల మహిమ
ఉగాది రోజు పంచాంగం విన్నారా? దీనిలోని తిథులు, రోజులు, పక్షాలు, నెలలు, రుతువులు.. అన్నీ కాల గమన సంకేతాలే. అసలు కాలమంటే ఏంటి? అది ఎలా మొదలైంది? ఇలాగే కొనసాగుతుందా? అంతమవుతుందా? -
సామాజిక వ్యసనం శ్రుతి మించుతోందా?
సామాజిక మాధ్యమాలు వ్యసనంగా మారాయా? దీన్నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే పామ్సీ యాప్ సాయం తీసుకోవచ్చు. -
బహుబలి కెమెరా
అమెరికాలోని ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలేటర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు