పాత ఫోనే.. కొత్తగా

కొన్నాళ్లు వాడగానే ఫోన్‌ పాతబడిపోతుంటుంది. పనితీరు మునుపటితో పోలిస్తే అంతగా బాగుండదు. అలాగని ఏడాదో, రెండేళ్లకోసారో ఫోన్‌ మార్చేద్దామంటే వేలకువేలు పోసి కొత్తది కొనడం ప్రతీసారీ సాధ్యం కాదుగా! అందుకే మన దగ్గర...

Updated : 30 Jun 2021 06:31 IST

కొన్నాళ్లు వాడగానే ఫోన్‌ పాతబడిపోతుంటుంది. పనితీరు మునుపటితో పోలిస్తే అంతగా బాగుండదు. అలాగని ఏడాదో, రెండేళ్లకోసారో ఫోన్‌ మార్చేద్దామంటే వేలకువేలు పోసి కొత్తది కొనడం ప్రతీసారీ సాధ్యం కాదుగా! అందుకే మన దగ్గర ఉన్న ఫోనే కొత్తదానిలా మెరవాలంటే, పని చేయాలంటే ఇలా ప్రయత్నించి చూడండి.

యాప్‌లు తీసేయండి

క్కసారి అవసరానికే కొన్ని యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేసేస్తుంటాం. ఇంకొన్నింటిని ఎప్పుడోగానీ ఉపయోగించం. ఇలాంటి యాప్‌లు ఫోన్‌లో ఏమేం ఉన్నాయో చూసి అన్‌ఇన్‌స్టాల్‌ చేసేయాలి. స్టోరేజీ సామర్థ్యం భారీగా పెరుగుతుంది. భారం తగ్గడంతో ఆటోమేటిగ్గా పనితీరు మెరుగవుతుంది. దీంతోపాటు అప్పుడప్పుడు ఫోన్‌ని రీస్టార్ట్‌ చేస్తుంటే వేగం పెరుగుతుంది.

కొత్త కేస్‌లు

కారం, పరిమాణం తీసుకుంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫోన్లన్నీ దాదాపు ఒకేలా ఉంటున్నాయి? మరి తేడా ఏంటి? అంటే ఫోన్‌ కేస్‌లు. ఇవి కేవలం ఫోన్‌కి గీతలు పడకుండా, డ్యామేజీ కాకుండా రక్షణనివ్వడమే కాదు.. అందంగా కనిపించేలానూ చేస్తాయి. ఒక మంచి కేస్‌ను జోడిస్తే ఫోన్‌ కొత్తగా మెరిసిపోవడం ఖాయం.

సామర్థ్యం పెంచుదాం


 

దాదాపు అన్ని ఫోన్లు స్టోరేజీ పెంచుకునేలా ఎస్‌డీ కార్డ్‌ స్లాట్‌లతో వస్తున్నాయి. మెమరీ కార్డులు వేస్తే ఫోన్‌పై భారం తగ్గుతుంది. స్పీడ్‌ పెరుగుతుంది. ఐఫోన్లలో అయితే ఈ సదుపాయం ఉండదు. కానీ వైర్‌లెస్‌ కనెక్ట్‌ స్టిక్‌తో స్టోరేజీ పెంచుకునే   అవకాశం ఉంటుంది.

నోటిఫికేషన్లు వద్దు

దీ మిస్‌ కాకూడదు అనే ఉద్దేశంతో చాలామంది సోషల్‌ మీడియా, ఇతర న్యూస్‌ యాప్స్‌ నోటిఫికేషన్లు ఆన్‌లో ఉంచుతారు. వీటితో ఫోన్‌ పనితీరు దెబ్బ తింటుంది. బ్యాటరీ బలహీనం అవుతుంది. అత్యవసరం అయితే తప్ప పాపప్‌ నోటిఫికేషన్లు రాకుండా మ్యూట్‌లో ఉంచుకోవాలి.

ఫొటోలు తొలగిద్దాం

ఫొటోలు, వీడియోలు, ఆడియో ఫైల్స్‌.. ఫోన్‌ స్టోరేజీని అత్యధికంగా తినేస్తుంటాయి. ముఖ్యమైనవి తప్ప వీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. పెన్‌డ్రైవ్‌, పీసీలలో బ్యాకప్‌ తీసుకొని ముఖ్యమైనవి మాత్రమే ఉంచుకోవచ్చు. ఫోన్‌ నుంచే గూగుల్‌ డ్రైవ్‌, డ్రాప్‌బాక్స్‌లాంటి ఎక్స్‌టర్నల్‌ స్టోరేజీల్లోకి బదలాయించుకొని ఫొటోలు, వీడియోలు డిలిట్‌ చేస్తే ఫోన్‌ వేగం అందుకుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని