క్యాన్సర్‌ను పట్టించిన యాపిల్‌ వాచ్‌

యాపిల్‌ వాచ్‌ కేవలం పరికరంగానే కాదు. ప్రాణాలను కాపాడే సాధనంగానూ ఉపయోగపడుతోంది. తాజాగా అమెరికాకు చెందిన ఇమానీ అనే అమ్మాయిలో అరుదైన క్యాన్సర్‌ను గుర్తించేలా చేసి, అబ్బుర పరిచింది. గుండె వేగాన్ని తెలిపే నోటిఫికేషన్‌ ఫీచర్‌ సాయంతో దీన్ని సాధించింది.

Published : 26 Oct 2022 00:14 IST

యాపిల్‌ వాచ్‌ కేవలం పరికరంగానే కాదు. ప్రాణాలను కాపాడే సాధనంగానూ ఉపయోగపడుతోంది. తాజాగా అమెరికాకు చెందిన ఇమానీ అనే అమ్మాయిలో అరుదైన క్యాన్సర్‌ను గుర్తించేలా చేసి, అబ్బుర పరిచింది. గుండె వేగాన్ని తెలిపే నోటిఫికేషన్‌ ఫీచర్‌ సాయంతో దీన్ని సాధించింది. ఆ అమ్మాయి ధరించిన యాపిల్‌ వాచ్‌ ఆగకుండా బీప్‌మని శబ్దం చేస్తూ.. గుండె వేగం సరిగా లేదని ఆమె తల్లికి హెచ్చరిక పంపించింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అపెండిక్స్‌లో కణితి ఉన్నట్టు బయటపడింది. పిల్లల్లో ఇలాంటిది అరుదు. దాన్ని సర్జరీ చేసి తొలగించాల్సి ఉంటుందని డాక్టర్లు నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని