వాడని ట్యాబ్స్‌కు క్రోమ్‌ పరిష్కారం

అంతర్జాల విహారంలో కొన్నిసార్లు ఎక్కువ ట్యాబ్‌లు ఓపెన్‌ చేస్తుంటాం. ఇవి ఎక్కువ మెమరీని వాడుకుంటాయి. ఫలితంగా పీసీ వేగం తగ్గుతుంది. దీన్ని పరిష్కరించటానికి గూగుల్‌ క్రోమ్‌ త్వరలో మెమరీ సేవర్‌, బ్యాటరీ సేవర్‌ మోడ్‌లను ప్రవేశ పెట్టనుంది.

Published : 02 Nov 2022 00:17 IST

అంతర్జాల విహారంలో కొన్నిసార్లు ఎక్కువ ట్యాబ్‌లు ఓపెన్‌ చేస్తుంటాం. ఇవి ఎక్కువ మెమరీని వాడుకుంటాయి. ఫలితంగా పీసీ వేగం తగ్గుతుంది. దీన్ని పరిష్కరించటానికి గూగుల్‌ క్రోమ్‌ త్వరలో మెమరీ సేవర్‌, బ్యాటరీ సేవర్‌ మోడ్‌లను ప్రవేశ పెట్టనుంది. ఇప్పటికే తాజా మెనూ సెటింగ్స్‌లో వీటిని పరీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా వాడని ట్యాబ్స్‌ను ఈ మెమరీ సేవర్‌ మోడ్‌ నిద్రాణ స్థితిలోకి నెడుతుంది. దీంతో పీసీ మెమరీ పెరిగి, ఇతర అప్లికేషన్లను వాడుకోవటానికి వీలవుతుంది. ఆయా ట్యాబ్‌లను చూసినప్పుడు తిరిగి అవి ఉత్తేజితమవుతాయి. ఇతర అవసరాల కోసం ఎంత ర్యామ్‌ ఫ్రీ అయ్యిందనే సమాచారమూ పాపప్‌ అవుతుంది. ఏయే ట్యాబ్‌లను నిద్రాణ స్థితిలో ఉంచుకోవాలో కూడా మనమే నిర్ణయించుకోవచ్చు. ఇక బ్యాటరీ సేవ్‌ మోడేమో హై రిఫ్రెష్‌ రేట్‌ ఫీచర్లను, విజువల్‌ ఎఫెక్టులను ఆఫ్‌ చేసేస్తుంది. ఇలా బ్యాటరీ త్వరగా నిండుకోకుండా చూస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌ పనులనూ అదుపులో ఉంచుతుంది. ఫలితంగా పీసీ వేగం పుంజుకుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని