ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా?
ఫోన్‌తో నేరుగా కనెక్ట్ అయ్యే వైర్డ్ ఇయర్‌ఫోన్స్ కావొచ్చు. బ్లూటూత్‌తో అనుసంధానమయ్యే ట్రూ వైర్‌లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్) వంటి వైర్‌లెస్ ఇయర్‌బర్డ్స్ కావొచ్చు. ఏవైనా గానీ రోజురోజుకీ వీటికి ఆదరణ పెరుగుతోంది.
ఫోన్‌తో నేరుగా కనెక్ట్ అయ్యే వైర్డ్ ఇయర్‌ఫోన్స్ కావొచ్చు. బ్లూటూత్‌తో అనుసంధానమయ్యే ట్రూ వైర్‌లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్) వంటి వైర్‌లెస్ ఇయర్‌బర్డ్స్ కావొచ్చు. ఏవైనా గానీ రోజురోజుకీ వీటికి ఆదరణ పెరుగుతోంది. ఇవి సంగీతం, మాటల వంటివి స్పష్టంగా వినిపించటానికి తోడ్పడే మాట నిజమే అయినా.. అదేపనిగా వింటూ ఉంటే వినికిడి లోపించే ప్రమాదముంది. పరికరమూ దెబ్బతినొచ్చు. మరి ఇలాంటి సమస్యలను నివారించుకోవటమెలా?
* వాల్యూమ్‌ను మీడియం స్థాయి కన్నా మించకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. మరీ అత్యవసరమైతే తప్ప వాల్యూమ్ 100% చేరుకోకుండా ముందే సెట్ చేసుకోవాలి. చుట్టుపక్కల రణగొణ ధ్వనులున్నప్పుడు వాల్యూమ్‌ను పెంచుకున్నా ఆ తర్వాత వెంటనే తగ్గించేసుకోవాలి. గరిష్ఠ వాల్యూమ్‌లో 60% కన్నా మించకుండా చూసుకోవాలన్నది ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫారసు.
* గంటలకొద్దీ ఇయర్‌ఫోన్స్ వాడొద్దు. మధ్యమధ్యలో తీసి పక్కన పెట్టటం తప్పనిసరి. అదేపనిగా, గంటల కొద్దీ ఇయర్‌ఫోన్స్‌ను వాడితే చెవులే కాదు, పరికరమూ దెబ్బతింటుంది.
* నాయిస్ కాన్సెలేషన్ రకం హెడ్‌ఫోన్స్‌ను కొనటం మంచిది. ఇవి నేపథ్య శబ్దాలను అడ్డుకుంటాయి. తక్కువ వాల్యూమ్‌లోనే స్పష్టంగా వినటానికి తోడ్పడతాయి.
* ఇయర్‌బడ్స్‌ను తరచూ శుభ్రం చేయటం మరవొద్దు. దుమ్ము పడితే చెవి ఇన్‌ఫెక్షన్లు తలెత్తొచ్చు. పరికరం కూడా దెబ్బతినొచ్చు.
* ఎప్పుడో అప్పుడంటే ఇబ్బంది లేకపోవచ్చు గానీ తరచూ ఇయర్‌ఫోన్స్‌ను ఇతరులతో షేర్ చేసుకోవటం తగదు. వేరేవాళ్లు వాడిన ఇయర్‌ఫోన్స్‌తో చెవిలోని గులిమి, బ్యాక్టీరియా అంటుకునే ప్రమాదముంది.
* ఇయర్‌బడ్స్‌తో అంతగా పనిలేనప్పుడు, బోర్ కొట్టినప్పుడు ఆఫ్ చేయటం మంచిది. స్మార్ట్‌ఫోన్‌లోని బ్లూటూత్‌ను, బడ్స్ బ్లూటూత్ కనెక్షన్ రెండింటినీ ఆఫ్ చేయాలని గుర్తుంచుకోవాలి.
* బ్యాటరీ లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు ఇయర్‌ఫోన్స్‌ను వాడొద్దు. ఒకవేళ అలాగే వాడుతుంటే పరికరం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.