పామాయిల్‌కు ప్రత్యామ్నాయం

ఆహార, సౌందర్య ఉత్పత్తుల్లో పామాయిల్‌ను విరివిగా వాడుతుంటారు. దీనికి రోజురోజుకీ గిరాకీ పెరుగుతుండటంతో పామ్‌ చెట్ల సాగుకు అడవులనూ నరుకుతున్నారు

Published : 11 Oct 2023 00:03 IST

ఆహార, సౌందర్య ఉత్పత్తుల్లో పామాయిల్‌ను విరివిగా వాడుతుంటారు. దీనికి రోజురోజుకీ గిరాకీ పెరుగుతుండటంతో పామ్‌ చెట్ల సాగుకు అడవులనూ నరుకుతున్నారు. ముఖ్యంగా భూమధ్య రేఖకు దగ్గర్లోని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎడిన్‌బరోలోని క్వీన్‌ మార్గరెట్‌ యూనివర్సిటీ పరిశోధకులు పామాయిల్‌కు ప్రత్యామ్నాయాన్ని రూపొందించారు. దీని పేరు పామ్‌-ఆల్ట్‌. ఇది పూర్తిగా వృక్ష సంబంధమైంది. పర్యావరణానికి 70% వరకు మేలు చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. పామ్‌-ఆల్ట్‌ చూడటానికి అచ్చం పామాయిల్‌ మాదిరిగానే ఉంటుంది. ప్రత్యేక సెన్సర్లతో పరీక్షించినా రుచిలోనూ ఎలాంటి తేడా లేకపోవటం గమనార్హం. చూడటానికి మయొనేజ్‌ మాదిరిగా కనిపించే దీనికి చక్కెర, తీపి పదార్థాలు, రంగు, నిల్వ కారకాలేవీ కలపలేదు. అవిసెగింజలు, ఆవాలు, సహజ పీచు పదార్థాలను కలిపి పామ్‌-ఆల్ట్‌ను రూపొందించారు. పామాయిల్‌ కన్నా 80% తక్కువ సంతృప్త కొవ్వు, 30% తక్కువ కేలరీలు ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికీ మేలు చేస్తుందని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని