డాక్స్‌లో క్యూఆర్‌ కోడ్‌!

ఇటీవల క్యూఆర్‌ కోడ్స్‌ చాలా ఆదరణ పొందుతున్నాయి. చిన్నవే అయినా వీటిల్లో ఎంతో సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. క్యూర్‌ కోడ్‌ స్కానర్‌ యాప్‌ లేదా కెమెరాలో బిల్టిన్‌ ఫీచర్‌ లేకపోతే వీటిని చూడలేం కాబట్టి ఇవి సురక్షితం కూడా. అందుకే కొందరు టెక్స్ట్‌ డాక్యుమెంట్లలోనూ వీటిని వాడుతుంటా

Published : 13 Jul 2022 00:34 IST

టీవల క్యూఆర్‌ కోడ్స్‌ చాలా ఆదరణ పొందుతున్నాయి. చిన్నవే అయినా వీటిల్లో ఎంతో సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. క్యూర్‌ కోడ్‌ స్కానర్‌ యాప్‌ లేదా కెమెరాలో బిల్టిన్‌ ఫీచర్‌ లేకపోతే వీటిని చూడలేం కాబట్టి ఇవి సురక్షితం కూడా. అందుకే కొందరు టెక్స్ట్‌ డాక్యుమెంట్లలోనూ వీటిని వాడుతుంటారు. గూగుల్‌ డాక్స్‌లోనూ దీన్ని సృష్టించుకోవచ్చు. ఇందుకు గూగుల్‌ వర్క్‌స్పేస్‌ యాడ్‌-ఆన్‌ ఉపయోగపడుతుంది.

* ముందుగా గూగుల్‌ డాక్స్‌ను ఓపెన్‌ చేసి, డాక్‌ ఫైల్‌లోకి వెళ్లాలి.

* మెనూలో కనిపించే ‘యాడ్‌-ఆన్స్‌’ మీద క్లిక్‌ చేసి, డ్రాప్‌ డౌన్‌ జాబితాలో ‘గెట్‌ యాడ్‌-ఆన్స్‌’ను నొక్కాలి.

* అప్పుడు గూగుల్‌ వర్క్‌స్పేస్‌ మార్కెట్‌ ప్లేస్‌ తెరచుకుంటుంది. సెర్చ్‌ బాక్స్‌లో క్యూఆర్‌ కోడ్‌ జనరేటర్‌ అని టైప్‌ చేస్తే బోలెడన్ని యాడ్‌ ఆన్స్‌ కనిపిస్తాయి. వీటిల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి.

* కోడ్‌ జనరేటర్‌ పేజీ ఓపెన్‌ అయ్యాక ‘ఇన్‌స్టాల్‌’ బటన్‌ మీద నొక్కాలి. తర్వాత ‘కంటిన్యూ’ మీద నొక్కి, కన్‌ఫర్మ్‌ చేసుకుంటే ఇన్‌స్టాల్‌ అవుతుంది.

* అనంతరం డాక్‌లో తిరిగి మెనూలోకి వెళ్లి, యాడ్‌-ఆన్స్‌ మీద క్లిక్‌ చేసి, క్యూఆర్‌ కోడ్‌ జనరేటర్‌ను ఎంచుకోవాలి. అప్పుడు ఒక పేజీ తెరచుకుంటుంది. దీనిలోని బాక్సులో క్యూఆర్‌ కోడ్‌గా మార్చుకోవాలని అనుకుంటున్న అక్షరాలను టైప్‌ చేయాలి. అది దానంతటదే క్యూఆర్‌ కోడ్‌గా మారిపోతుంది.

* ‘కాపీ టు క్లిప్‌బోర్డు’ మీద క్లిక్‌ చేస్తే కోడ్‌ కాపీ అవుతుంది. దీన్ని డాక్యుమెంట్‌లో పేస్ట్‌ చేసుకుంటే సరి.

* దీంతో బార్‌ కోడ్‌, కాంటాక్ట్‌ క్యూఆర్‌ కోడ్‌, వైఫై క్యూఆర్‌ కోడ్‌ వంటివీ సృష్టించుకోవచ్చు.

థర్డ్‌ పార్టీ వైబ్‌సైట్లతోనూ..

గూగుల్‌ వర్క్‌స్పేస్‌తో యాడ్‌ ఆన్‌ పొందలేకపోయినట్టయితే థర్డ్‌ పార్టీ వెబ్‌సైట్లతోనూ క్యూఆర్‌ కోడ్‌ సృష్టించుకొని, డాక్స్‌లో పేస్ట్‌ చేసుకోవచ్చు.

* క్యూఆర్‌ కోడ్‌ను జనరేట్‌ చేసే వెబ్‌సైట్‌ను (ఉదా:https://www.qr-code-generator.com/) ఓపెన్‌ చేయాలి.

* తర్వాత టెక్స్ట్‌ బాక్స్‌లో అక్షరాలను టైప్‌ లేదా పేస్ట్‌ చేయాలి.

* కోడ్‌ జనరేట్‌ అయ్యాక అది పక్కవైపున కనిపిస్తుంది. ‘డౌన్‌లోడ్‌’ బటన్‌ మీద క్లిక్‌ చేసి క్యూఆర్‌ కోడ్‌ను ఇమేజ్‌గా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

* ఇప్పుడు గూగుల్‌ డాక్స్‌లోకి వెళ్లి, మెనూలో ‘ఇన్‌సర్ట్‌’ను క్లిక్‌ చేయాలి.

* డ్రాప్‌ డైన్‌ మెనూలో ఇమేజ్‌ విభాగం ద్వారా ‘అప్‌లోడ్‌ ఫ్రం కంప్యూటర్‌’ను ఎంచుకోవాలి.

* తర్వాత క్యూఆర్‌ కోడ్‌ ఫైలును ఎంచుకొని, అప్‌లోడ్‌ చేయాలి.

* అంతే. క్యూఆర్‌ కోడ్‌ రూపంలో యాడ్‌ చేయాలనుకునే టెక్స్ట్‌ డాక్‌లో చేరిపోతుంది. కావాలనుకుంటే దీని సైజునూ మార్చుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని