ఆండ్రాయిడ్‌లో యూట్యూబ్‌ కొత్తగా

గూగుల్‌ సంస్థ ఆండ్రాయిడ్‌ టీవీల్లో యూట్యూబ్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేయటం మొదలెట్టింది. దీంతో మెటీరియల్‌ యూ థీమ్‌ను పోలిన కొత్త యూఐ డిజైన్‌ ప్లేయర్‌ అనుభం సొంతమవుతుంది.

Published : 19 Oct 2022 00:30 IST

గూగుల్‌ సంస్థ ఆండ్రాయిడ్‌ టీవీల్లో యూట్యూబ్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేయటం మొదలెట్టింది. దీంతో మెటీరియల్‌ యూ థీమ్‌ను పోలిన కొత్త యూఐ డిజైన్‌ ప్లేయర్‌ అనుభం సొంతమవుతుంది. అంతేకాదు, చూస్తున్న వీడియోకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకో వటానికీ వీలుంటుంది. ఇంతకుముందు వీడియో శీర్షిక తెరకు ఎడమ వైపు మూలన కనిపించేది. తాజా అప్‌ డేట్‌తో ఇది మాత్ర ఆకారంలోని బాక్స్‌లో కనిపిస్తుంది. ఇందులో పేరుతో పాటు వీక్షణల సంఖ్య, పబ్లిష్‌ అయిన తేదీ కూడా ఉంటాయి. తెరకు ఎడమ మూలన ప్లేబ్యాక్‌ ప్రోగ్రెస్‌ బార్‌కు పైన ఈ బాక్స్‌ ఉంటుంది. ప్రోగ్రెస్‌ బార్‌ కింద వీడియో రికమెండేషన్లు ప్రత్యక్షమవుతాయి. వీడియోలో ఆయా భాగాలను వెతికేటప్పుడూ ఇవి మసక బాక్సుల మాదిరిగా కనిపిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని