ఎక్సెల్‌లో కెమెరా!

మైక్రోసాఫ్ట్‌ ఎక్సెల్‌లో ఎన్నెన్నో టూల్స్‌. వీటిల్లో ఒకటి కెమెరా. దీంతో డేటా, టేబుల్‌, గ్రాఫ్‌ వంటి వాటిల్లో అవసరమైనంత వరకే సెలెక్ట్‌ చేసుకొని స్నాప్‌షాట్‌ తీసుకోవచ్చు.

Published : 12 Apr 2023 00:08 IST

మైక్రోసాఫ్ట్‌ ఎక్సెల్‌లో ఎన్నెన్నో టూల్స్‌. వీటిల్లో ఒకటి కెమెరా. దీంతో డేటా, టేబుల్‌, గ్రాఫ్‌ వంటి వాటిల్లో అవసరమైనంత వరకే సెలెక్ట్‌ చేసుకొని స్నాప్‌షాట్‌ తీసుకోవచ్చు. దీన్ని లింక్డ్‌ పిక్చర్‌గా పేస్ట్‌ చేసుకోవచ్చు. ఈ స్నాప్‌షాట్‌ను పిక్చర్‌ టూల్స్‌తో ఫార్మాట్‌, రీసైజ్‌ చేసుకోవచ్చు. దీన్ని కాపీ చేసుకొని వర్డ్‌, పవర్‌పాయింట్‌ డాక్యుమెంట్లలోనూ పేస్ట్‌ చేసుకోవచ్చు. మరి దీన్ని ఎనేబుల్‌ చేసుకోవటమెలా?

*  క్విక్‌ యాక్సెస్‌ టూల్‌బార్‌ మీద కెమెరా టూల్‌ డిఫాల్ట్‌గా కనిపించదు. కాబట్టి దీన్ని ఎనేబుల్‌ చేసుకోవాలి.

* ఎక్సెల్‌ ఫైల్‌ను ఓపెన్‌ చేసి, పైన చిన్న డ్రాప్‌డౌన్‌ బటన్‌ మీద క్లిక్‌ చేస్తే క్విక్‌ యాక్సెస్‌ టూల్‌బార్‌ కనిపిస్తుంది. కింద కనిపించే జాబితాలో మోర్‌ కమాండ్స్‌ను ఎంచుకోవాలి.

*  చూజ్‌ కమాండ్స్‌ ఫ్రమ్‌ బాక్స్‌లో ఆల్‌ కమాండ్స్‌ను సెట్‌ చేసుకోవాలి. అప్పుడు కింద అన్ని కమాండ్స్‌ కనిపిస్తాయి. ఇందులో కెమెరా ఆప్షన్‌ను ఎంచుకొని, పక్కనుండే యాడ్‌ బటన్‌ను నొక్కాలి. తర్వాత ఓకే బటన్‌ను క్లిక్‌ చేయాలి. అప్పుడు క్విక్‌ యాక్సెస్‌ టూల్‌బార్‌ మీద కెమెరా గుర్తు ప్రత్యక్షమవుతుంది.

* డేటాషీట్‌లో అవసరమైన భాగాన్ని ఎంచుకొని, కెమెరా బటన్‌ మీద క్లిక్‌ చేసి స్నాప్‌షాట్‌ తీసుకోవచ్చు. మరో షీట్‌ ఓపెన్‌ చేసి, దీన్ని పేస్ట్‌ చేసుకోవచ్చు. పిక్చర్‌ టూల్స్‌ ట్యాబ్‌ ద్వారా దీనికి   స్టైళ్లను, డిజైన్స్‌ను జత చేసుకోవచ్చు కూడా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని