హైడ్రోజన్‌ను తయారుచేసే పొడి!

హైడ్రోజన్‌ స్వచ్ఛ ఇంధనమే కావొచ్చు. పర్యావరణ హితం దృష్ట్యా అందరినీ ఆకర్షిస్తుండొచ్చు. కానీ నిల్వ చేయటం, తరలించటమే కష్టం. దీన్ని అధిగమించటానికి శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.

Published : 27 Jul 2022 00:44 IST

హైడ్రోజన్‌ స్వచ్ఛ ఇంధనమే కావొచ్చు. పర్యావరణ హితం దృష్ట్యా అందరినీ ఆకర్షిస్తుండొచ్చు. కానీ నిల్వ చేయటం, తరలించటమే కష్టం. దీన్ని అధిగమించటానికి శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా ఈపీఆర్‌ఓ టెక్నాలజీ (ఈఏటీ) ఈ విషయంలో గొప్ప ముందడుగు వేసింది. అప్పటికప్పుడు అతి శుద్ధమైన హైడ్రోజన్‌ను పెద్ద ఎత్తున తయారుచేసే వినూత్న పొడిని రూపొందించింది. సన్నటి రంధ్రాలతో కూడిన ఈ సిలికాన్‌ పదార్థం పేరు సి+. ఇది నీటి నుంచి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఘన రూపంలో ఉండటం వల్ల దీన్ని తేలికగా నిల్వ చేయొచ్చు, తరలించొచ్చు. హైడ్రోజన్‌ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్న ఎన్నో సమస్యలను ఇది పరిష్కరించగలదని భావిస్తున్నారు. ఇంతకీ ఇదెలా పనిచేస్తుంది? హైడ్రోజన్‌ అవసరమైనప్పుడు సి+ పొడిని నీటిలో వేసి కలిపితే చాలు. వెంటనే బుడగల రూపంలో హైడ్రోజన్‌ పుట్టుకొస్తుంది. ఈ పొడి 0-80 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలో ఎక్కడైనా పనిచేస్తుంది. మరో మంచి విషయం ఏంటంటే- హైడ్రోజన్‌ ఉత్పత్తి అయ్యాక సిలికాన్‌ డయాక్సైడ్‌ మిగులుతుంది. ఇసుకలో ముఖ్య పదార్థం ఇదే. దీన్ని నిర్మాణాలకు నిక్షేపంగా వాడుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని