పీత పెంకుల నుంచి ఆప్టికల్‌ భాగాలు

పీత పెంకుల నుంచి తీసిన చిటోసాన్‌ నుంచి జీవ ప్లాస్టిక్‌ను రూపొందించటంలో ఫిలిప్పీన్స్‌ పరిశోధకులు విజయం సాధించారు. దీంతో కాంతిని వికిరణం చెందించే ఆప్టికల్‌ భాగాలను తయారు చేయొచ్చని చెబుతున్నారు.

Updated : 29 Mar 2023 05:14 IST

పీత పెంకుల నుంచి తీసిన చిటోసాన్‌ నుంచి జీవ ప్లాస్టిక్‌ను రూపొందించటంలో ఫిలిప్పీన్స్‌ పరిశోధకులు విజయం సాధించారు. దీంతో కాంతిని వికిరణం చెందించే ఆప్టికల్‌ భాగాలను తయారు చేయొచ్చని చెబుతున్నారు. వివిధ దిశల్లో వేర్వేరు రంగుల్లో కాంతిని వెదజల్లే వీటిని లేజర్లు, టెలీకమ్యూనికేషన్‌ పరికరాలు, స్పెక్ట్రోమీటర్ల వంటి వాటిల్లో వాడుతుంటారు. పీత పెంకుల నుంచి సంగ్రహించిన చిటోసాన్‌ తేలికగా ఉంటుంది. దీన్ని సిలికోన్‌కు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. చిటోసాన్‌ ఆధారిత వికిరణ ఉత్పత్తులు తేలికగా ఉంటాయి. చవక కూడా. పైగా ఇవి సిలికోన్‌ ఆధారిత ఉత్పత్తుల మాదిరిగానే పనిచేస్తున్నట్టు ప్రాథమిక అధ్యయనంలో వెల్లడైంది. పీత పెంకులను వ్యర్థాలుగా పారేస్తుంటారు కాబట్టి ఇది పర్యావరణ హితానికి తోడ్పడగలదని పరిశోధకులు ఆశిస్తున్నారు. చిటోసాన్‌ను జీవసామర్థ్య పాలిమర్‌గా గుర్తిస్తుంటారు. ఇది లిథియం-అయాన్‌కు ప్రత్యామ్నాయం కాగలదనీ.. నానోపార్టికల్స్‌ రూపంలో ఊపిరితిత్తి క్యాన్సర్‌ చికిత్సలోనూ ఉపయోగపడగలదని ఆశిస్తున్నారు. దీన్ని గట్టి పదార్థంగా మలచుకోవచ్చని తేలటంతో పెద్ద ఎత్తున తయారు చేయగలిగితే మున్ముందు ఫైబర్‌ ఆప్టిక్‌కు ప్రత్యామ్నాయంగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని