iPhone 14: ఐఫోన్ 14.. మినీకి బై..బై.. పిక్సెల్ బిన్నింగ్ టెక్‌తో కెమెరా!
2022లో యాపిల్ ఐఫోన్ 14ను విడుదల చేయనుంది. అయితే వీటిలో మినీ మోడల్ ఇక మీదట ఉండబోదని టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఐఫోన్ 14లో ఎలాంటి ఫీచర్లు ఉండబోతున్నాయో ఒక్కసారి చూద్దాం.
ఇంటర్నెట్‌డెస్క్: ఒకవైపు కరోనా, మరోవైపు లాక్డౌన్.. ఈ పరిస్థితుల్లో అనుకున్న సమయానికి విడుదలవుతుందా..? లేదా? అన్న ఉత్కంఠకు తెర దించుతూ ఐఫోన్ 13 ఎప్పటిలానే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో మార్కెట్లోకి విడుదలైంది. తర్వాతేంటి.. ఇంకేముంది 2022 సెప్టెంబర్‌కి ఐఫోన్ 14 విడుదల కోసం ఎదరుచూడటమే అనే సమాధానం చాలా మంది టెక్ ప్రియుల నుంచి వినిపిస్తోంది. మరి ఐఫోన్ 14 ఎలా ఉంటుంది? అందులో ఏమేం ఫీచర్స్ ఇస్తారు.. వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
ఎప్పటిలానే ఐఫోన్ 14 కూడా నాలుగు వేరియంట్లలో తీసుకొస్తున్నారట. ఐఫోన్ 14, ఐఫోన్ 14 మాక్స్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్. అయితే ఈసారి మినీ వేరియంట్ ఉండకపోవచ్చని టెక్ వర్గాల భావిస్తున్నాయి. ఐఫోన్ 12, ఐఫోన్ 13 మోడల్స్‌లో మినీ వేరింయట్ల అమ్మకాలు ఆశించినస్థాయిలో లేకపోవడంతో యూజర్స్ వీటిపై పెద్దగా ఆసక్తి చూపడంలేదని యాపిల్ భావిస్తోందట. ఇక ఐఫోన్ 14, 14 ప్రో మోడల్స్‌లో 6.1 అంగుళాల డిస్ప్లే, మాక్స్, ప్రో మాక్స్ మోడల్స్‌లో 6.7 అంగుళాల డిస్ప్లే ఇస్తున్నారట. ఈ ఫోన్లలో 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో హోల్ పంచ్ డిస్ప్లే ఇస్తున్నట్లు సమాచారం.
అలానే ప్రో మోడల్స్‌లో వెనుకవైపు మూడు కెమెరాలు ఉంటాయట. వాటిలో 48 ఎంపీ వైడ్లెన్స్తోపాటు, 12 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, టెలి లెన్స్ అమర్చినట్లు తెలుస్తోంది. ఇవి 8కే వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయట. అలానే 48 ఎంపీ కెమెరాలో పిక్సెల్ బిన్నింగ్ కెమెరా టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఇది తక్కువ లైట్ ఉన్నప్పుడు కూడా అత్యుత్తమ క్వాలిటీ ఫొటోలను అందిస్తుంది. ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో 8 జీబీ ర్యామ్ , ఐఫోన్ 14 మోడల్స్‌లో 6జీబీ ర్యామ్‌తో పనిచేస్తాయని తెలుస్తోంది. ఐఫోన్ 13 తరహాలోనే వీటిలో కూడా శాటిలైట్ నెట్వర్క్ కనెక్టివిటీ ఫీచర్ ఉంటుందట. ఈ ఫోన్లలో యాపిల్ 5ఎన్ఎమ్ ఏ16 బయోనిక్ చిప్ ఉపయోగిస్తున్నారని సమాచారం.
► Read latest Tech & Gadgets News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెబ్క్యామే స్కానర్
డెస్క్‌టాప్ ఉంది గానీ స్కానర్ లేదా? పోనీ వెబ్‌క్యామ్ అయినా ఉందా? అయితే దీన్నే స్కానర్‌లా వాడుకుంటే సరి. మ్యాక్‌లోనైతే- ఫొటో బూత్‌ను ఓపెన్ చేసి, డాక్యుమెంట్‌ను వెబ్‌క్యామ్ ముందుకు తీసుకురావాలి. -
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా వచ్చింది
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్ అకౌంట్ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్ 17.5 స్టేబుల్ వర్షన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. -
బహుబలి కెమెరా
అమెరికాలోని ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలేటర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు. -
పిక్సెల్ ఫోన్లలో లుకప్ ఫీచర్
గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడేవారికి శుభవార్త. తెలియని నంబర్ల నుంచి కాల్ చేసే వారిని గుర్తించే లుకప్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీన్ని ఇంతకుముందు జపాన్‌లో పరిచయం చేశారు గానీ ఇతర ప్రాంతాల్లో విడుదల చేయలేదు. -
మొబైల్ రోబో
వినూత్న ఫీచర్లతో కూడిన కొత్త టూల్స్‌తో టెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. అలాంటి టూల్ ఒకటి ఇటీవలే విడుదలైంది. దీని పేరు ఎల్ఓఓఐ. ఇదో చిన్న డెస్క్‌టాప్ రోబో. -
మిమిక్రీ ఇంజిన్!
ప్రముఖ కృత్రిమ మేధ కంపెనీ ఓపెన్ఏఐ తాజాగా వాయిస్ అసిస్టెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా వాయిస్ ఇంజిన్ అనే వినూత్న టూల్‌ను పరిచయం చేసింది. -
కొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్‌టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
ఐఫోన్ కిటుకులు
ఐఫోన్లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్‌కు అప్డేట్ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు. -
ఫొటో కటౌట్ చిటికెలో
ఫొటోలో వెనక దృశ్యాలను తొలగించి, కటౌట్ చేయటం పెద్ద పని. అడోబ్ ఫొటోషాప్, ఏఐ టూల్స్ వంటి అధునాతన సాధనాలు అవసరం. -
సెల్ సర్వీసు మొరాయిస్తే?
ఎప్పుడైనా సెల్‌ఫోన్ సర్వీసు సరిగా పనిచేయకపోతే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టి, కాసేపు వేచి చూడాలి. తర్వాత ఫోన్‌ను యథాస్థితికి తేవాలి. దీంతో ఫోన్ సమీపంలోని సెల్ టవర్‌తో కనెక్ట్ అవుతుంది -
పాస్వర్డ్ మేనేజర్ భద్రమేనా?
భద్రత, బ్యాకప్ టూల్స్‌గా పాస్వర్డ్ మేనేజర్స్ ఉపయోగపడతాయి. వీటితో పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవటం, ప్రతీసారీ పాస్‌వర్డ్‌ను టైప్ చేయటం తప్పుతాయి. కానీ చాలామంది వీటిని వాడుకోరు. హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను దొంగిలించే ప్రమాదముందని భావించటం దీనికి ఒక కారణం. అందువల్ల ఇవి మంచివేనా? అనే అనుమానం కలుగుతుంటుంది. -
ఐఫోన్‌కు మరింత భద్రత
యాపిల్ సంస్థ ఐఓఎస్ 17.3 బీటాతో ఐఫోన్ల కోసం గొప్ప భద్రత ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని పేరు స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. పేరుకు తగ్గట్టుగానే ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినప్పుడు యాపిల్ ఖాతాను కాపాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐఫోన్ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. -
ఇక మొబైల్ ఫోనే టీవీ
రేడియో, ఫోన్లలోని రిసీవర్ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్ ఫోన్లో యూట్యూబ్‌లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం. -
పాత ప్రింటర్‌ను అమ్ముతున్నారా?
ప్రింటర్‌తో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ప్రింట్ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ రహస్య సమాచారంతో కూడిన పత్రాలనూ ప్రింట్ చేస్తుంటాం. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. -
నచ్చిన ఫొటోల స్లైడ్‌షో
ఇష్టమైన ఫొటోలను స్లైడ్ షోగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. విండోస్ పీసీ వాడేవారు తమకు తామే దీన్ని సృష్టించుకోవచ్చు. నచ్చిన వాల్పేపర్లు, ఫొటోలను ఒక ఫోల్డర్లో వేయాలి. -
ఫొటో అసలుదేనా?
ఆన్లైన్లో ఎన్నో ఫొటోలు. అన్నీ అసలువే కాకపోవచ్చు. కొన్ని నకిలీ ఫొటోలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ఫొటోలతో ఈ బెడద మరింత ఎక్కువైంది కూడా. -
కీబోర్డు మీద వేళ్ల ప్రయాణం!
కీబోర్డు మీద చకచకా టైప్ చేస్తుంటాం గానీ ఆ సమయంలో చేతి వేళ్లు ఎంత దూరం ప్రయాణించాయో ఎప్పుడైనా లెక్కించారా? చేతి వేళ్లు ప్రయాణించటమేంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు. -
వినూత్నం మృదు రోబో
ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్ కరోలీనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు. ట్విస్టెట్ రింగ్‌బాట్స్‌ను రూపొందించి సంచలనం సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్‌లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!