
Smartphones: స్మార్ట్‌ఫోన్స్ సూపర్ లైనప్!
ఇంటర్నెట్‌డెస్క్: వినియోగదారులను ఆకట్టుకోవడానికి స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఎప్పటికప్పడు కొత్త ఫీచర్లతో ఫోన్లను విడుదల చేస్తుంటాయి. ఇప్పటికే శాంసంగ్, నోకియా, రియల్మీ కంపెనీలు తమ వంతుగా కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేశాయి. అలానే మరికొన్ని కంపెనీలు కొత్త ఫోన్లను తీసుకొస్తున్నాయి. మరింకెందుకు ఆలస్యం ఆ జాబితాపై ఓ లుక్కేద్దామా..
ఒప్పో రెనో 6
ఒప్పో కంపెనీ రెనో సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను తీసుకురానుంది. రెనో 6, రెనో 6 ప్రో పేరుతో వీటిని జులై 14 తేదీన విడుదల చేయనుంది. 8జీబీ ర్యామ్, 12జీబీ ర్యామ్ + 256జీబీ ఇంటర్నల్ మెమొరీ వేరియంట్లో ఈ ఫోన్లు రానున్నాయి. వీటిలో ఐదు కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. ముందు 64ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు మరో మూడు కెమెరాలు, ముందు 32ఎంపీ సెల్ఫీ కెమెరాఉంటుందని సమాచారం. 6.55-అంగుళాల డిస్ప్లే ఇస్తున్నారట. ఈ ఫోన్ మిగతా ఫీచర్ల గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. భారత మార్కెట్లో ఈ ఫోన ధర రూ. 39,000 వరకు ఉండొచ్చని అంచనా.
రెడ్మీ నోట్ 10టీ 5జీ
రెడ్మీ తన తొలి 5జీ ఫోన్ నోట్ 10టీని జులై 20న మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ ఫోన్ భారత మొబైల్ యూజర్స్‌కి 5జీ నెట్‌వర్క్‌ను మరింత చేరువచేస్తుందని రెడ్మీ ధీమాగా ఉంది. ఈ ఏడాది మార్చిలో నోట్ 10 సిరీస్‌లో రెడ్మీ నాలుగు కొత్త ఫోన్లను విడుదల చేసింది. ఫీచర్స్ విషయంలో వాటికి మించి ఈ ఫోన్ ఉంటుందని సమాచారం. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారట. 6జీబీ ర్యామ్+ 128జీబీ మెమొరీ వేరియంట్లలో లభిస్తుందని తెలుస్తోంది. 48 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు ముందు 8ఎంపీ కెమెరా ఉంటుందని సమాచారం. దీని ధర సుమారు రూ. 20,000 ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ
వన్‌ప్లస్ నార్డ్‌కు కొనసాగింపుగా జులై 22 తేదీన వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ ఫోన్‌ను తీసుకురానున్నారు. మధ్యశ్రేణి మార్కెట్ లక్ష్యంగా నార్డ్ 2 5జీ విడుదల చేయనున్నారు. అంతేకాకుండా ఫోన్‌కి సంబంధించిన వివరాలను వన్‌ప్లస్ అధికారికంగా ప్రకటించింది. ఇందులో 6.43-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్ చిప్సెట్ ఉపయోగించారని సమాచారం. 12జీబీ ర్యామ్ + 256జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్లో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారట. ఈ ఫోన్ ధర రూ. 30 వేలు ఉంటుందని సమాచారం.
గూగుల్ పిక్సెల్ 6
గూగుల్ నుంచి పిక్సెల్ సిరీస్‌లో ఈ ఏడాది కొత్త ఫోన్ రాబోతుంది. గతంలో వచ్చిన పిక్సెల్ మోడల్స్‌కి భిన్నంగా ఈ ఫోన్ డిజైన్ ఉంటుందట. తొలిసారిగా గూగుల్‌కి చెందిన వైట్‌ఛాపెల్ చిప్‌సెట్‌ను ఈ ఫోన్లో ఉపయోగించారని తెలుస్తోంది. ఓఎల్ఈడీ డిస్ప్లే, 50 ఎంపీ ప్రధాన కెమెరా వంటి ఫీచర్స్ ఇందులో ఉంటాయని సమాచారం. 8జీబీ ర్యామ్ + 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారట. భారత మారెట్లో దీని ధర సుమారు రూ. 55,000 నుంచి రూ. 60 వేలు ఉంటుందని అంచనా.
ఐపాడ్ మినీ
యాపిల్ కూడా కొత్త ఐపాడ్ మినీ మోడల్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. డిజైన్ పరంగా ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం. 8.3-అంగుళాల డిస్ప్లే ఇస్తున్నారట. యాపిల్ ఏ14 బయోనిక్ చిప్సెట్తో ఐపాడ్ మినీ పనిచేస్తుందని సమాచారం. అన్నికంటే ముఖ్యంగా ఇందులో యూఎస్బీ-సీ టైప్ పోర్ట్ ఇస్తున్నారని టెక్ వర్గాల తెలిపాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఐపాడ్ మినీ మార్కెట్లోకి వస్తుందని అంచనా.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.