వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేయాలా?
ఆండ్రాయిడ్ మొబైల్లో వాట్సాప్ అకౌంట్‌ను తీసేయాలంటే... ఈ దిగువ స్టెప్స్ పాటించాలి.
ఇంటర్నెట్ డెస్క్: వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ దృష్ట్యా చాలా మంది... ఆ యాప్ వినియోగాన్ని మానేస్తున్నారు. కొత్త పాలసీని విశ్లేషించిన టెక్ నిపుణులు.. యూజర్ల డేటాను వాట్సాప్... ఫేస్‌బుక్‌కు అందిస్తోందని చెప్పుకొచ్చారు. మరోవైపు వాట్సాప్ ‘యూజర్ల డేటాను మేం ఎవరికీ ఇవ్వం’ అని కూడా ప్రకటించింది. అయితే వాట్సాప్ ఇక సురక్షితం కాదంటూ చాలామంది యాప్‌ను తొలగించేస్తున్నారు. అయితే తొలగించే ముందు మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. వాటిని పాటించేయండి... మీ డేటాను తీసుకోండి.
ఆండ్రాయిడ్ మొబైల్లో వాట్సాప్ అకౌంట్‌ను తీసేయాలంటే... ఈ దిగువ స్టెప్స్ పాటించాలి.
• వాట్సాప్ ఓపెన్ చేసి టాప్‌లో ఉన్న మూడు చుక్కల ఐకాన్ క్లిక్ చేయండి.
• అందులోని ‘సెట్టింగ్స్’ సెక్షన్లోకి వెళ్లండి.
• ఆ తర్వాత ‘అకౌంట్’ ఆప్షన్‌లోకి వెళ్తే... ‘డిలీట్ మై అకౌంట్’ అని ఆప్షన్ ఉంటుంది.
• ‘డిలీట్ మై అకౌంట్’ ఆప్షన్‌లోకి వెళ్తే మీ మొబైల్ నెంబరును మరోసారి ఎంటర్ చేయమని అడుగుతుంది.
• మొబైల్ నెంబరు ఇచ్చాక.. ‘వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేయడానికి కారణమేంటి?’ అని అడుగుతుంది.
• ఆ ప్రశ్నకు సమాధానమిచ్చాక... దిగువన్న ఉన్న ‘డిలీట్ మై అకౌంట్’ బటన్‌ను క్లిక్ చేయాలి.
• అప్పుడు మీ వాట్సాప్ అకౌంట్ డిలీట్ అయిపోతుంది. ఆ తర్వాత యాప్‌ను అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
• యాపిల్ మొబైల్స్‌లో అయితే ‘సెట్టింగ్స్’ ఐకాన్ బాటమ్ మెనూ బార్లోనే ఉంటుంది. మిగిలిన ప్రక్రియ ఆండ్రాయిడ్ స్టయిల్లోనే ఉంటుంది.
• పై ప్రాసెస్ పూర్తి చేసి వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేశాక... ఆ ప్రక్రియ పూర్తవడానికి సుమారు 90 రోజులు పడుతుంది. మళ్లీ వాట్సాప్ వాడాలనుకుంటే మీరు కొత్త ఖాతా తెరవాల్సిందే.
మీ డేటా తీసుకోవాలనుకుంటే...
వాట్సాప్ ఖాతా డిలీట్ చేసేముందు వాట్సాప్‌లోని మీ డేటాను కలెక్ట్ చేసుకోవాలనుకుంటే దానికీ ఓ ఆప్షన్ ఉంది. దాని కోసం తొలుత వాట్సాప్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అందులోని అకౌంట్ సెక్షన్లోకి వెళ్తే ‘రిక్వెస్ట్ అకౌంట్ ఇన్ఫో’ అని ఉంటుంది. దాని క్లిక్ చేస్తే మీ రిక్వెస్ట్ వాట్సాప్‌కు వెళ్తుంది. అయితే మీరు అడిగిన డేటా వెంటనే మీకు అందుబాటులోకి రాదు. మీ రిక్వెస్ట్ తీసుకొని వాట్సాప్ బ్యాక్ఎండ్లో మీ డేటాను సిద్ధం చేసి నోటిఫికేషన్ పంపిస్తుంది. అప్పుడు పాత విధానంలోనే ‘రిక్వెస్ట్ ఇన్ఫో ఆప్షన్’ వరకు వెళ్తే అక్కడ ‘డౌన్లోడ్’ అని కనిపిస్తుంది. అక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తే జిప్ ఫోల్డర్ రూపంలో డౌన్లోడ్ అయిపోతుంది.
అన్నీ వద్దు అనుకుంటే...
వాట్సాప్ అకౌంట్ తీసేస్తున్నా... మొత్తం అన్ని ఛాట్స్ అవసరం లేదు. కొన్ని మాత్రమే చాలు అనుకుంటే.. దానికీ ఓ ఆప్షన్ ఉంది. దాని కోసం ఆయా అకౌంట్/గ్రూప్ ఓపెన్ చేసి టాప్‌లో ఉన్న మూడు చుక్కల ఐకాన్‌ను క్లిక్ చేయండి. అందులో ‘ఎక్స్పోర్ట్ ఛాట్’ అని ఉంటుంది. దానిని క్లిక్ చేస్తే ఆ ఛాట్ మాత్రం ఎక్స్పోర్ట్ అయ్యి... మీ మొబైల్లో సేవ్ అవుతుంది. అయితే ఇలా చేస్తే కేవలం టెక్స్ట్ మాత్రమే లభిస్తుంది. ఒకవేళ ఫొటోలు, వీడియోలు కూడా కావాలంటే... ఎక్స్పోర్ట్ గూగుల్ డ్రైవ్, జీమెయిల్ లాంటి వాటిలోకి సేవ్ అవుతుంది.
ఇవీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాట్సప్ ఛాట్ ఫిల్టర్
వాట్సప్ గత కొన్నిరోజులుగా గోప్యతను కాపాడుతూనే ఎన్నో వినూత్న ఫీచర్లు పరిచయం చేస్తోంది. ఎక్కువ మందికి మెటా ఏఐని అందుబాటులోకి తేవటం దగ్గరి నుంచి యాప్ నుంచే బస్ టికెట్లు కొనుక్కోవటానికి వీలు కల్పించటం వరకూ ఎన్నో సదుపాయాలను ఆరంభించింది. -
సైన్ఇన్ లేకుండానే ఛాట్‌జీపీటీ
ఛాట్‌జీపీటీని వాడుకోవాలంటే ముందు సైన్ఇన్ కావాల్సి ఉంటుంది. పాస్‌వర్డ్‌ను మరచిపోవటం వంటి సందర్భాల్లో ఇది కష్టంగా అనిపిస్తుంటుంది. -
ఎక్స్‌లో కమ్యూనిటీ నోట్స్
ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో ఎక్స్ (ట్విటర్) మనదేశంలో కమ్యూనిటీ నోట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌కు కంట్రిబ్యూట్ చేయటానికి కొత్తవారికీ ఆహ్వానం పలికింది -
వైఫై పాస్వర్డ్ మరిచారా?
ఇంటికి వచ్చిన అతిథులో, పరిచయం ఉన్నవారో వైఫై పాస్వర్డ్ అడుగుతుంటారు. చాలాసార్లు అదేంటో గుర్తుకురాదు. మరెలా? చేతిలో ఫోన్ ఉంటే ఇట్టే తెలుసుకోవచ్చు. ఐఫోన్ వాడేవారైతే- సెటింగ్స్ ద్వారా వైఫై విభాగంలోకి వెళ్లాలి. -
సైబర్ నేరాలకు చక్షు కళ్లెం
మోసపూరిత కాల్స్, మెసేజ్‌ల వంటి సైబర్ నేరాలను అరికట్టటానికి టెలికం విభాగం కొత్త పోర్టల్‌ను పరిచయం చేసింది. సంచార్ సాథీ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చిన దీని పేరు చక్షు. -
యాపిల్ పాడ్‌కాస్ట్‌లు అక్షరాల్లో..
పాడ్‌కాస్ట్‌లు ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాపిల్ సంస్థ పాడ్‌కాస్ట్‌లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవటానికి, వాటిల్లోని అంశాలను, విషయాలను తేలికగా కనుక్కోవటానికి ఓ వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టింది -
ఫొటోతోనే వీడియో..
షేక్స్పియర్ స్వగతాన్ని మోనాలిసా పాట రూపంలో పాడితే? అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇలాంటి అద్భుతాలు ఎన్నయినా చేయొచ్చు -
చిటికెలో వెబ్సైట్
కొద్ది నిమిషాల్లో వెబ్‌సైట్‌ను సృష్టించుకోవాలని అనుకుంటున్నారా? అయితే విక్స్ ఏఐ వెబ్సైట్ బిల్డర్ సాయం తీసుకోవచ్చు. ఇది ఏఐ ఛాట్‌బాట్ సాయంతో సెకండ్లలోనే వెబ్‌సైట్‌ను తయారుచేస్తుంది మరి. -
మన డ్రోన్ ఉపగ్రహం!
డ్రోన్ల గురించి తెలిసిందే. వేడుకల్లో వీడియోలు తీయటం దగ్గరి నుంచి పొలాల్లో మందులు చల్లటం వరకూ రకరకాల పనులకు ఉపయోగపడుతున్నాయి. మరి ఇవి ఉపగ్రహం మాదిరిగానూ పనిచేస్తే? అలా ఉపయోగపడగల మానవరహిత బుల్లి విమాన వాహనాన్ని (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్- యూఏవీ) బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ (ఎన్ఏఎల్) గతవారం విజయవంతంగా పరీక్షించింది. -
వాట్సప్‌లో ఫేవరెట్స్ ట్యాబ్
వాట్సప్ ఛాట్స్ జాబితాలో ఇష్టమైన కాంటాక్టులను కనుక్కోవటం కష్టంగా ఉందా? త్వరలోనే దీనికి పరిష్కారం లభించనుంది. కొత్తగా ఫేవరెట్స్ ట్యాబ్‌ను పరిచయం కానుంది. దీన్ని ప్రస్తుతం ఐఓఎస్, వెబ్ యూజర్ల కోసం పరీక్షిస్తున్నారు. -
ఎక్స్ క్యాచీ శుభ్రం
ఎక్స్ (ట్విటర్) మొబైల్ యాప్ ఫోన్లో, ట్యాబ్లెట్లో క్యాచ్డ్ ఫైళ్లను నిల్వ చేస్తుందని తెలుసా? ఒకవేళ ఫోన్లో స్టోరేజీ నిండుకుంటున్నట్టయితే ఎక్స్ వెబ్, మీడియా క్యాచీని తొలగించుకోవటం తేలికైన, సత్వర పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుంది. -
టెక్ చిట్కాలు
ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇకపై బయోలో ఐదు లింకుల వరకు యాడ్ చేసుకోవచ్చు. యాప్‌లో లాగిన్ అయ్యాక అకౌంట్ సెటింగ్స్‌ను ఓపెన్ చేయాలి. మన ఫొటో దిగువన ఉండే ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్లి యాడ్ లింకును క్లిక్ చేయాలి. షేర్ చేయాలనుకునే లింకు జత చేసుకుంటే సరి. -
ప్రైవసీ విధాన వివరాలు తేలికగా ..
వెబ్సైట్లకు ప్రైవసీ పాలసీలు ఉండటం తెలిసిందే. వీటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ ఆయా విధానాలను చదవాలన్నా పెద్దగా ఉంటాయి. -
యూట్యూబ్ వీడియో ఆడియోగా మారితే
యూట్యూబ్ అంటే ఎప్పుడూ చూడటమేనా? రేడియో మాదిరిగా పాటలు, సంగీతాన్ని వినలేమా? కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుంటుంది. వీడియోలను ఆడియో ఫైళ్లుగా సేవ్ చేసుకుంటే ఇది సాధ్యమే -
సోషల్ ఖాతా హ్యాక్ అయితే?
ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్.. ఇలా ఎన్నెన్నో సామాజిక మాధ్యమాలు. అభిప్రాయాలు పంచుకోవటానికైనా.. చుట్టుపక్కల సమాచారాన్ని తెలుసుకోవటానికైనా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి -
అనవసర జీమెయిళ్ల తొలగింపు తేలికగా
అనవసర ఈమెయిళ్లు చాలా చికాకు కలిగిస్తాయి. రోజురోజుకీ ఇన్‌బాక్స్‌లో నిండిపోతూ వస్తుంటాయి. కొన్నిసార్లు వీటిని డిలీట్ చేయటానికే సమయమంతా వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. -
మెయిల్‌కు జవాబు మరుస్తుంటే?
మెయిల్‌ను చదువుతాం. తర్వాత జవాబిద్దామని అనుకుంటాం. తీరా మరచిపోతాం. ఎప్పటికో గానీ గుర్తుకురాదు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంటాం కదా. -
ఫోన్ టైపింగ్ వేగంగా
స్మార్ట్‌ఫోన్‌లో వేగంగా టైప్ చేయాలనుకుంటున్నారా? అయితే టెక్స్ట్ రిప్లేస్మెంట్ సాయం తీసుకోండి. దీంతో పెద్ద పదబంధాలకు షార్ట్‌కట్స్‌ను సెట్ చేసుకుంటే చాలా సమయం ఆదా అవుతుంది. -
స్నాప్‌చాట్ లైవ్ లొకేషన్‌తో భద్రం
మీ పిల్లలు స్నాప్‌ఛాట్ వాడుతున్నారా? కాస్త జాగ్రత్త. దీనిలోని లైవ్ లొకేషన్ ఫీచర్‌ను కొందరు దుర్వినియోగం చేయొచ్చు. పిల్లలు ఎక్కడున్నారో గుర్తించొచ్చు. -
మన మెయిల్ మనకే!
కొత్త సంవత్సరంలో లక్ష్యాలు నిర్దేశించుకున్నారా? వాటిని ఎంతవరకు సాధించారో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటం ఎంతైనా మేలు చేస్తుంది. ఇంకా చేయాల్సిందేంటి? ఎలా చేయాలి? అనేవి నిర్ణయించుకోవటానికి వీలవుతుంది -
ఛాట్‌జీపీటీకి సమాచారమా?
ఛాట్‌జీపీటీ వాడుతున్నారా? దీనికి వ్యక్తిగత వివరాలూ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఛాట్‌జీపీటీకి మనం ఇచ్చే సమాచారమంతా భవిష్యత్ ఏఐ నమూనాలకు తర్ఫీదు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. మున్ముందు ఇదెక్కడికి దారితీస్తుందో ఎవరికీ తెలియదు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
-
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్‌లో గేర్లు ఎక్కువే: మూడీ
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
-
దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త..!