Jio Game Controller: ‘జియో గేమ్‌’తో ఆట ఆడేస్తారా..? ధర, ఫీచర్లివే!

ఫీచర్‌ ఫోన్‌, స్మార్ట్‌ఫోన్‌ తర్వాత జియో కంపెనీ మరో కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేసింది. గేమింగ్‌ ప్రియుల కోసం జియో గేమ్‌ కంట్రోలర్‌ పేరుతో కొత్త డివైజ్‌ను పరిచయం చేసింది. మరి ఈ కొత్త డివైజ్‌ ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం..

Updated : 02 Jun 2022 20:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫీచర్‌ ఫోన్‌, స్మార్ట్‌ఫోన్‌ తర్వాత జియో కంపెనీ మరో కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేసింది. గేమింగ్‌ ప్రియుల కోసం జియో గేమ్‌ కంట్రోలర్‌ పేరుతో కొత్త డివైజ్‌ను పరిచయం చేసింది. మరి ఈ డివైజ్‌ ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

జియో గేమ్‌ కంట్రోలర్‌ ఫీచర్లు

డిజైన్‌ పరంగా జియో గేమ్‌ కంట్రోలర్‌ ఎక్స్‌బాక్స్‌ను అనుసరించింది. జియో గేమ్‌ కంట్రోల్‌లో సుమారు 20 బటన్స్‌ ఉన్నాయి. ఎక్స్‌బాక్స్‌ గేమ్‌ కంట్రోల్ లేఅవుట్‌లో మాదిరి కుడివైపు జాయ్‌స్టిక్‌, ఎడమవైపు నాలుగు కంట్రోల్ బటన్స్‌, అనలాగ్ స్టిక్‌ ఇస్తున్నారు. షోల్డర్‌ బటన్స్‌ కుడివైపు రెండు, ఎడమవైపు రెండు ఉన్నాయి. డివైజ్‌ మధ్యలో జియో బటన్‌, హోమ్‌ కీ, టీవీ కీ, బ్యాక్‌ కీలను అమర్చారు. జియో గేమ్‌ కంట్రోలర్‌ వైర్‌లెస్‌ డివైజ్‌. పది మీటర్ల దూరం నుంచి కూడా దీంతో గేమింగ్‌ను ఆస్వాదించవచ్చు. ఇందులో లోలేటన్సీ ఫీచర్‌ కూడా ఉంది. ఈ డివైజ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 8 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తుందని జియో తెలిపింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్‌, ట్యాబ్‌లెట్స్‌, ఆండ్రాయిడ్ టీవీ, జియో సెట్‌ టాప్‌ బాక్స్‌, పీసీ, ల్యాప్‌టాప్‌లను ఇది సపోర్ట్ చేస్తుంది.   

ధర

జియో గేమ్‌ కంట్రోలర్‌ ధర రూ. 3,499. దీనిని ఈఎమ్‌ఐ ఆప్షన్‌ ద్వారా కూడా సొంతం చేసుకోవచ్చు. రూ. 164 నుంచి ఈఎమ్‌ఐ ప్రారంభమవుతుంది. జియో వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని