Smart phones: కొత్త మోడల్స్‌తో ఫిబ్రవరి సిద్ధమే.. మరి మీరూ..!

ఫిబ్రవరిలో విడుదలయ్యే కొత్త స్మార్ట్‌ ఫోన్లపై ఓ లుక్కేద్దాం.. రండి..

Published : 31 Jan 2022 14:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త ఏడాదిలో అప్పుడే మొదటి నెల చివరి అంకానికి చేరుకుంది. ఒకటి రెండు తప్పితే గ్యాడ్జెట్‌ ప్రియులను పెద్దగా కట్టిపడేసే మొబైల్స్‌ జనవరిలో విడుదలే కాలేదు. ఇంతలో ఫిబ్రవరి రానే వస్తోంది. అత్యుత్తమ కొత్త ఉత్పత్తుల కోసం టెక్‌ ప్రియులు నిరీక్షిస్తున్నారు. మరి ఎప్పటిలాగే ఫిబ్రవరిలో కంపెనీలు తీసుకొచ్చే గొప్ప మోడల్స్‌.. వాటి ఫీచర్లపై మనమూ ఓ లుక్కేద్దాం.. రండి.

శాంసంగ్ నుంచి ఎస్‌22 సిరీస్‌

శాంసంగ్‌ కంపెనీకి సంబంధించి ఫిబ్రవరిలో గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ 2022 ఈవెంట్‌ ఉంది. ఈ వేడుకలో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్22 సిరీస్‌ మోడల్స్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. అయితే, ఈవెంట్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. గెలాక్సీ ఎస్‌21 మోడల్‌కు కొనసాగింపుగా గెలాక్సీ S22, S22+, S22 అల్ట్రా మోడల్స్‌ను శాంసంగ్‌ తీసుకురానుంది. వరుసగా 6.06, 6.55, 6.81 అంగుళాల స్క్రీన్‌లు వీటిలో ఉండనున్నాయి. అలాగే కొత్త కెమెరా సెటప్‌, 15W ఫాస్ట్ ఛార్జ్, 5000 mAh బ్యాటరీ, ఎగ్జినోస్‌ 2200 ప్రాసెసర్ ప్రత్యేకతలు. చైనా, అమెరికా మార్కెట్‌లో మాత్రం ఎస్‌22 సిరీస్‌ను స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 1 ప్రాసెసర్‌తో తీసుకురానున్నారట. ఈ మోడల్స్‌ ధరపై ఇంకా స్పష్టత రావాలి. 


తేదీ గుర్తుపెట్టుకోండి..

ఒప్పో రెనో 7 సిరీస్‌కు చెందిన మూడు మోడల్స్‌ (Oppo Reno 7, 7 SE, 7 Pro) ఫిబ్రవరి 4న భారత్‌లో విడుదల కానున్నాయి. ఇప్పటికే ఒప్పో ఈ మోడల్స్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. 8 జీబీ ర్యామ్‌/128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 8 జీబీ/256 జీబీ, 12 జీబీ/256 జీబీ వేరియంట్లలో లభిస్తున్నాయి. ఒప్పో రెనో 7 మోడల్‌ స్నాప్‌డ్రాగన్‌ 778జీ ప్రాసెసర్‌తో వస్తుండగా, ప్రో మోడల్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 1200 మ్యాక్స్‌తో మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది.  


రెడ్‌మీ నుంచి కొత్తగా...

చైనా టెక్‌ దిగ్గజం షావోమీ రెడ్‌మీ నోట్‌ 11 సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. రెడ్‌మీ నోట్‌ 10కు కొనసాగింపుగా మొత్తం నాలుగు మోడల్స్‌తో ఈ సిరీస్‌ ఫోన్లను తీసుకొచ్చింది. ప్రీమియం శ్రేణిలో రెడ్‌మీ నోట్‌ 11 ప్రో, 11 ప్రో 5జీని.. బడ్జెట్‌ కేటగిరీలో రెడ్‌మీ నోట్‌ 11ఎస్‌, రెడ్‌మీ నోట్‌ 11ను విడుదల చేసింది. వీటిని ఫిబ్రవరి 9న భారత్‌లో లాంచ్‌ చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. రెడ్‌మీ నోట్‌ ప్రో 11-5జీ మోడల్‌ 6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌తో వస్తోంది. దీని ఇంటర్నల్ స్టోరేజీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చని కంపెనీ తెలిపింది. అలాగే రెడ్‌మీ నోట్‌ 11 ప్రో.. మీడియాటెక్ హీలియో జీ96 చిప్‌సెట్‌తో రానుంది. 

ఇక నాలుగు మోడల్స్ ‌(Redmi K50, K50 Pro, K50 Pro+, K50 గేమింగ్)తో రెడ్‌మీ కే50 సిరీస్‌ను ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు సమాచారం. వీటిలోని ఒక్కో మోడల్‌లో ఒక్కో ప్రాసెసర్‌ ఉండటం విశేషం. వరుసగా వీటిలో స్నాప్‌డ్రాగన్‌ 870, మీడియాటెక్‌ డైమెన్సిటీ 8000, మీడియాటెక్‌ డైమెన్సిటీ 9000, స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 1 చిప్‌లు ఉండనున్నాయి. షావోమీ 12 సిరీస్‌ లాగే రెడ్‌మీ K50 సిరీస్‌లోనూ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఆయా మోడళ్లను బట్టి ఫీచర్లు, ధరలు ఉంటాయి. 

ఇక బడ్జెట్‌ కేటగిరీలో Redmi Note 11, Note 11S రెండూ 6.4-అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, 5,000 mah బ్యాటరీ, 33W ఛార్జర్, 3.5mm ఆడియో జాక్‌తో వస్తున్నాయి. నోట్‌ 11లో స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌, నోట్‌ 11ఎస్‌ మీడియాటెక్‌ హీలియో సెల్ఫీ కెమెరాతో వస్తోంది.


రియల్‌మీ నుంచి రెండు

రియల్‌మీ నుంచి రెండు ప్రో మోడల్స్‌ (Realme 9 Pro, Realme 9 Pro+) ఫిబ్రవరిలో విడుదల కానున్నట్లు సమాచారం. 9 ప్రో+ 90 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్ అమోలెడ్‌ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 920, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుండగా, మరోవైపు 9 ప్రో.. 120 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్ 6.6-అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 695,  8జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రావచ్చని తెలుస్తోంది. 


వన్‌ప్లస్‌ నార్డ్‌-సీఈ 2 (OnePlus Nord CE 2) ఫిబ్రవరిలోనే మన చేతిలోకి రానుంది. ఈ మేరకు భారత్‌లో పరీక్షల దశను దాటేసింది. 6.4 అంగుళాల పూర్తి-హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే, 90 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్‌సెట్, 64-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ఇది రానున్నట్లు సమాచారం. 


Note: పైన పేర్కొన్న జాబితాతో పాటే మరికొన్ని స్మార్ట్ మోడల్స్‌ ఫిబ్రవరిలో మార్కెట్లోకి రావచ్చు. వాటి స్పెసిఫికేషన్స్‌ బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. జనవరి నెలలోనూ కొన్ని ఫోన్లు విడుదలవుతాయని భావించినప్పటికీ వేర్వేరు కారణాలతో వాయిదా పడ్డాయి. ఫిబ్రవరిలోనూ ఈ పరిణామం కనిపించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని