Google Meet: అమల్లోకి 60 నిమిషాల నిబంధన..

వీడియో కాన్ఫరెన్స్, ఆన్‌లైన్ క్లాసులతో ఎంతో మందికి చేరువైన గూగుల్ మీట్ యాప్‌ ఉచిత యూజర్స్‌కి షాకివ్వనుంది. ఈ మేరకు గ్రూప్‌ వీడియో కాలింగ్‌కు ఉన్న అన్‌లిమిటెడ్ కాలింగ్ నిబంధనను సడలించనున్నట్లు తెలిపింది. దాంతో ఉచిత యూజర్స్ ఇక మీదల కేవలం 60 నిమిషాలు మాత్రమే ఉచితంగా వీడియో కాల్స్ మాట్లాడుకోగలరు...

Published : 15 Jul 2021 00:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వీడియో కాన్ఫరెన్స్, ఆన్‌లైన్ క్లాసులతో ఎంతో మందికి చేరువైన గూగుల్ మీట్ యాప్‌ ఉచిత యూజర్స్‌కి షాకివ్వనుంది. ఈ మేరకు గ్రూప్‌ వీడియో కాలింగ్‌కు ఉన్న అన్‌లిమిటెడ్ కాలింగ్ నిబంధనను సడలించనున్నట్లు తెలిపింది. దాంతో ఉచిత యూజర్స్ ఇక మీదల కేవలం 60 నిమిషాలు మాత్రమే ఉచితంగా వీడియో కాల్స్ మాట్లాడుకోగలరు. గతంలోనే 60 నిమిషాల నిబంధనను అమలు చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. కరోనా పరిస్థితుల కారణంగా గడువు తేదీని పలుమార్లు పొడిగించింది. తాజాగా 60 నిమిషాల నిబంధనను అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.

 ‘‘ముగ్గురు లేదా అంతకు మించిన సంఖ్యలో వీడియో కాల్‌లో పాల్గొనాలకునే వారు గూగుల్ మీట్‌లో 60 నిమిషాలపాటు ఉచితంగా మాట్లాడుకోవచ్చు. 55 నిమిషాల తర్వాత గ్రూప్‌ కాల్‌లో పాల్గొనేవారి స్క్రీన్‌ మీద ఐదు నిమిషాల్లో కాల్ ముగిసిపోతుందనే నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ కాల్ కొనసాగించాలంటే హోస్ట్‌ తన గూగుల్‌ ఖాతాను అప్‌గ్రేడ్ చేసుకోవాలి’’ అని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే వన్‌-టు-వన్‌ కాల్స్‌పై ఎలాంటి టైం పరిమితి లేదని, 24 గంటలపాటు నిరంతరాయంగా వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చని తెలిపింది. అన్‌లిమిటెడ్ గ్రూప్‌ వీడియో కాల్స్‌ కోసం తమ ఖాతాలను అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకునేవారు నెలకు 9.99 డాలర్లు (సుమారు రూ.745) చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల వీడియో కాల్స్‌ను 60 నిమిషాలకు మించి మాట్లాడుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని