Oppo: రెనో సిరీస్‌లో 5జీ ఫోన్లు..ఫీచర్లివే

ఒప్పో కంపెనీ రెనో సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఒప్పో రెనో 6 5జీ, రెనో 6 ప్రో 5జీ పేరుతో వీటిని తీసుకొచ్చింది. రెనో 6 ప్రీమియం మిడ్ రేంజ్‌లో రెనో 6 మోడల్‌, ఫ్లాగ్‌షిప్ కేటగిరిలో రెనో 6 ప్రోను పరిచయం చేశారు. గతంలో విడుదల చేసిన రెనో 5 సిరీస్‌కు కొనసాగింపుగా కొత్త ఫోన్లను తీసుకొచ్చారు.... 

Updated : 14 Jul 2021 20:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒప్పో కంపెనీ రెనో సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఒప్పో రెనో 6 5జీ, రెనో 6 ప్రో 5జీ పేరుతో వీటిని తీసుకొచ్చింది. రెనో 6 ప్రీమియం మిడ్ రేంజ్‌లో రెనో 6 మోడల్‌, ఫ్లాగ్‌షిప్ కేటగిరిలో రెనో 6 ప్రోను పరిచయం చేశారు. గతంలో విడుదల చేసిన రెనో 5 సిరీస్‌కు కొనసాగింపుగా కొత్త ఫోన్లను తీసుకొచ్చారు. వీటిలో ర్యామ్ ఎక్స్‌పాన్షన్‌ టెక్నాలజీ ఇస్తున్నారు. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ ఓఎస్‌ 11.3 ఓఎస్‌తో పనిచేస్తాయి. రెండు మోడల్స్‌ అరోరా, స్టెల్లార్ బ్లాక్ రంగుల్లో లభిస్తాయి. మరి వీటిలో ఇంకా ఎలాంటి ఫీచర్స్ ఇస్తున్నారు..ధరెంతో తెలుసుకుందాం.


రెనో 6 5జీ

 ఈ ఫోన్‌లో 90Hz రిఫ్రెష్‌ రేట్‌తో 6.43-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఫ్లాట్ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ ఉపయోగించారు. వెనకవైపు 64ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 8ఎంపీ, 2ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. వీడియో కాల్స్‌, సెల్ఫీల కోసం ముందు భాగంలో 32ఎంపీ కెమెరా అమర్చారు. 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 65వాట్ సూపర్‌వీఓఓసీ 2.0 ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 8జీబీ ర్యామ్‌ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 29,990. ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ స్టోర్లలో కొనుగోలు చెయ్యొచ్చు. 


రెనో 6 ప్రో 5జీ

ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఈ ఫోన్‌లో మొత్తం ఐదు కెమెరాలున్నాయి. వెనక నాలుగు, ముందు ఒక కెమెరా అమర్చారు. వెనకవైపు 64ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, 8ఎంపీ కెమెరా, రెండు 2ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ముందు 32ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ 65 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 12జీబీ ర్యామ్‌ + 256జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్లో ఈ ఫోన్‌ లభిస్తుంది. దీని ధర రూ. 39,990. 


ఒప్పో ఎన్కో ఎక్స్ 

వీటితోపాటు ఒప్పో టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఒప్పో ఎన్కో ఎక్స్ పేరుతో వీటిని ప్రవేశపెట్టారు. ఇందులో డ్యూయల్‌ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. మూడు మైక్రో ఫోన్లు ఉన్నాయి. నీటిలో పడినా పాడవకుండా ఉండేందుకు ఐపీ54 డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్ ఫీచర్ ఇస్తున్నారు. బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 25 గంటలపాటు (ఛార్జింగ్ కేస్‌తో కలిపి) నిరంతరాయంగా పనిచేస్తాయి. వీటి ధర రూ. 9,990 కాగా, ప్రారంభ ఆఫర్ కింద రూ. 1000 డిస్కౌంట్ ఇస్తున్నారు. బ్లూ కలర్‌లో లభిస్తుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని