డేటా షేరింగ్‌పై వాట్సాప్‌ వివరణ

ఇటీవల తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాట్సాప్‌ దీనిపై స్పందించింది. తాజా ప్రైవసీ పాలసీలో ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్‌కు సంబంధించిన పద్ధతుల్లో ఎలాంటి మార్పులూ చేయలేదని వివరణ..........

Published : 09 Jan 2021 19:53 IST

దిల్లీ: ఇటీవల తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాట్సాప్‌ దీనిపై స్పందించింది. తాజా ప్రైవసీ పాలసీలో ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్‌కు సంబంధించిన విషయంలో ఎలాంటి మార్పులూ చేయలేదని వివరణ ఇచ్చింది. టర్మ్స్‌ ఆఫ్‌ సర్వీసెస్‌, ప్రైవసీ పాలసీని ఇటీవల వాట్సాప్‌ అప్‌డేట్‌ చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను యూజర్లకు పంపిస్తోంది. వాట్సాప్‌ యూజర్ల డేటా ఫేస్‌బుక్, దాని అనుబంధ సంస్థలతో ఎలా పంచుకునేదీ వివరించింది. నవీకరించిన ప్రైవసీ పాలసీకి యూజర్లు అంగీకారం తెలిపేందుకు ఫిబ్రవరి 8ని గడువుగా నిర్దేశించింది. గడువులోగా అంగీకరించకపోతే తమ యాప్‌ను వినియోగించలేరని వాట్సాప్‌ పేర్కొంది.

ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్‌ అంశంపై వాట్సాప్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. వ్యక్తిగత సమాచారంపై ఆందోళన మొదలైంది. అదే సమయంలో పోటీ కంపెనీలైన సిగ్నల్‌, టెలీగ్రామ్‌ డౌన్‌లోడ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ హెడ్‌ విల్‌ కేత్‌కార్ట్‌ వరుస ట్వీట్లు చేశారు. పారదర్శకతను పెంచేందుకే కొత్త పాలసీని తీసుకొచ్చామని, బిజినెస్‌ ఫీచర్స్‌ను మరింత మెరుగ్గా యూజర్లకు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌తో వాట్సాప్‌ డేటా షేరింగ్‌కు సంబంధించిన ఎలాంటి మార్పులూ చేయలేదని తెలిపారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో చాట్‌ చేసే యూజర్లపై ఎలాంటి ప్రభావం ఉండబోదని స్పష్టం చేశారు. వ్యక్తిగత చాట్స్‌, కాల్స్‌కు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ (ఈ2ఈ) ఉండడం వల్ల ఆ వివరాలను తాము చూడలేమన్నారు. ఈ2ఈ విధానానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. 

ఇవీ చదవండి..
2021లో ఆన్‌లైన్ భద్రత.. ఏం చేయాలంటే..!
‘అలెక్సా’తో వస్తున్న లెనోవా ల్యాపీలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు